LOADING...
Google Maps: గూగుల్ మ్యాప్స్‌లో కొత్త ఏఐ ఫీచర్లు.. 'అస్క్ మ్యాప్స్', 'ఇమ్మెర్సివ్ నేవిగేషన్' ప్రారంభం
'అస్క్ మ్యాప్స్', 'ఇమ్మెర్సివ్ నేవిగేషన్' ప్రారంభం

Google Maps: గూగుల్ మ్యాప్స్‌లో కొత్త ఏఐ ఫీచర్లు.. 'అస్క్ మ్యాప్స్', 'ఇమ్మెర్సివ్ నేవిగేషన్' ప్రారంభం

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 13, 2026
09:22 am

ఈ వార్తాకథనం ఏంటి

గూగుల్‌ మ్యాప్స్‌ యాప్‌ను మరింత స్మార్ట్‌గా మార్చేందుకు గూగుల్‌ కృత్రిమ మేధ (AI) సాంకేతికతను విస్తృతంగా ఉపయోగించనుంది. వినియోగదారులకు మెరుగైన అనుభవాన్ని అందించేందుకు కంపెనీ రెండు కొత్త ఏఐ ఆధారిత ఫీచర్లను ప్రవేశపెట్టింది. ఇవి 'అస్క్ మ్యాప్స్‌' (Ask Maps), 'ఇమ్మెర్సివ్‌ నేవిగేషన్‌' (Immersive Navigation). ఈ ఫీచర్లతో కూడిన రీడిజైన్‌ చేసిన గూగుల్‌ మ్యాప్స్‌ యాప్‌ను గురువారం అధికారికంగా విడుదల చేశారు.

వివరాలు 

ప్రయాణాన్ని మరింత సులభంగా,సౌకర్యంగా ప్లాన్‌ చేసుకునే అవకాశం

ఇందులో భాగంగా తీసుకొచ్చిన 'యాస్క్‌ మ్యాప్స్‌' ఫీచర్‌ ప్రస్తుతం అమెరికా మరియు భారత్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ ఫీచర్‌ ద్వారా వినియోగదారులు తమకు సమీపంలో ఉన్న ప్రదేశాలు, కేఫ్‌లు, హోటళ్లు వంటి వివిధ ప్రాంతాల గురించి మరింత వివరమైన సమాచారాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుంది. అదే సమయంలో, వినియోగదారులు వెళ్లాలనుకునే ప్రాంతాలకు చేరుకునేందుకు అందుబాటులో ఉన్న ఉత్తమ మార్గాలను కూడా ఈ ఫీచర్‌ సూచిస్తుంది. దీంతో ప్రయాణాన్ని మరింత సులభంగా,సౌకర్యంగా ప్లాన్‌ చేసుకునే అవకాశం కలుగుతుంది.

Advertisement