
Polavaram: బడ్జెట్ లో పోలవరం ప్రాజెక్టుకు నిధులు కేటాయింపు.. ఎంతంటే..?
ఈ వార్తాకథనం ఏంటి
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో పోలవరం ప్రాజెక్టుకు నిధుల కేటాయింపును ప్రస్తావించారు.
పోలవరం ప్రాజెక్టుకు రూ. 12,157.53 కోట్లను కేటాయిస్తున్నట్లు వెల్లడించారు.
శనివారం, 2025-26 వార్షిక బడ్జెట్‌ను లోక్‌సభలో ఆమె సమర్పించారు.
గంటా 15 నిమిషాల పాటు కొనసాగిన బడ్జెట్ ప్రసంగంలో ముఖ్యమైన ప్రాజెక్టులకు నిధుల కేటాయింపును వివరించారు.
ఇందులో భాగంగా, పోలవరానికి నిధుల కేటాయింపును ప్రస్తావించారు.
వివరాలు
పోలవరానికి జాతీయ ప్రాజెక్ట్ హోదా
ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడిగా ఉన్న పోలవరం ప్రాజెక్టును ఏలూరు, తూర్పు గోదావరి జిల్లాల మధ్య గోదావరి నదిపై బహుముఖ ప్రయోజనాలతో నిర్మిస్తున్నారు.
ఈ ప్రాజెక్టుకు గత కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్ట్ హోదాను మంజూరు చేసింది.
గత దశాబ్దంగా ఈ ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయి. 2024లో జరిగిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది.
దీనివల్ల రాష్ట్ర కూటమి, కేంద్రంలోని ఎన్డీయేలో కీలకంగా మారింది. గత ఏడు నెలలుగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సహాయం అందిస్తోంది.
ఇటీవలి విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణకు కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ కింద రూ. 11,440 కోట్లను కేటాయించింది.