తదుపరి వార్తా కథనం

Polavaram Project: పోలవరం ప్రాజెక్టు పర్యటనలో సీఎం.. బాధితుల సమస్యలపై సమీక్షా
వ్రాసిన వారు
Jayachandra Akuri
Mar 27, 2025
01:50 pm
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ స్థలాన్ని సందర్శించారు.
ముందుగా ఏరియల్ వ్యూ ద్వారా ప్రాజెక్టు పనులను సమీక్షించిన ఆయన, అనంతరం పోలవరం వ్యూ పాయింట్ నుంచి నిర్మాణ పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా, పోలవరం నిర్వాసితులతో సమావేశమైన చంద్రబాబు, వారి సమస్యలను స్వయంగా విన్నారు. గత కొన్నేళ్లుగా ఎదురవుతున్న సమస్యలను ఆయన ముందు నిర్వాసితులు వివరించారు.
నిర్వాసితుల అర్జీల ప్రకారం, వరదల సమయంలో తమ ఇళ్లు ఖాళీ చేయాల్సి వచ్చినా, వారిని నాన్-రెసిడెంట్‌గా చూపించి పరిహారం ఇవ్వలేదని వారు సీఎం చంద్రబాబుకు తెలియజేశారు.
గత ప్రభుత్వ హయాంలో నిర్వాసితులను తెలంగాణలోకి తరలించేందుకు ప్రయత్నించిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ, ప్రస్తుత ప్రభుత్వం తమను ఆదుకోవాలని వేడుకున్నారు.