Page Loader
Polavaram: ఆంధ్రప్రదేశ్ కేంద్రం గుడ్ న్యూస్.. పోలవరానికి కేంద్ర కాబినెట్ గ్రీ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్ కేంద్రం గుడ్ న్యూస్.. పోలవరానికి కేంద్ర కాబినెట్ గ్రీ సిగ్నల్

Polavaram: ఆంధ్రప్రదేశ్ కేంద్రం గుడ్ న్యూస్.. పోలవరానికి కేంద్ర కాబినెట్ గ్రీ సిగ్నల్

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 28, 2024
02:54 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పోలవరం ప్రాజెక్టు పూర్తి నిర్మాణానికి అవసరమైన నిధులను ఇచ్చేందుకు కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నిర్ణయానికి సంబంధించి కేంద్ర క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. ప్రాజెక్టు పూర్తిచేయడానికి అవసరమైన నిధుల కేటాయింపును కేంద్రం ఆమోదించినట్లు తెలుస్తోంది. పెండింగ్‌లో ఉన్న పనులు సహా, పూర్తిచేయాల్సిన అన్ని నిర్మాణాల కోసం అవసరమైన నిధులను మంజూరు చేయడానికి కేంద్ర మంత్రివర్గం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్లు సమాచారం.

వివరాలు 

కేంద్రంతో చంద్రబాబు పలు దఫాలుగా చర్చలు 

పోలవరం ప్రాజెక్టు విషయంలో ఇప్పటికే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, జలశక్తి మంత్రి సి.ఆర్. పాటిల్‌తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పలు సమావేశాలు నిర్వహించారు. దిల్లీ వెళ్లి వారికి ప్రాజెక్టు పనులపై వివరణ ఇచ్చారు. ఈ చర్చల ఫలితంగా, ప్రాజెక్టు పూర్తి చేసేందుకు అవసరమైన నిధుల కేటాయింపునకు కేంద్రం అంగీకరించినట్లు తెలుస్తోంది.