తదుపరి వార్తా కథనం
Polavaram Project: పోలవరం డయాఫ్రం వాల్.. కొత్త నిర్మాణ పనులు ప్రారంభం
వ్రాసిన వారు
Jayachandra Akuri
Jan 18, 2025
11:47 am
ఈ వార్తాకథనం ఏంటి
పోలవరం ప్రాజెక్టులో కీలకమైన డయాఫ్రం వాల్ నిర్మాణ పనులు మొదలయ్యాయి. ఈ పనులను సంబంధిత కాంట్రాక్టు సంస్థ ప్రారంభించింది. 1.396 కిలోమీటర్ల పొడవైన ఈ డయాఫ్రం వాల్ కోసం ప్రణాళికలు రూపొందించారు.
1.5 మీటర్ల మందంతో నది ప్రవాహ మార్గంలో భూమి లోపల దీనిని నిర్మించనున్నారు. పాత డయాఫ్రం వాల్‌కు 6 మీటర్ల ఎగువన కొత్త నిర్మాణం చేపట్టాల్సి ఉంది.
సగం నిర్మాణం పూర్తి అయిన తరువాత, సమాంతరంగా కొత్త వాల్ పై ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యాం నిర్మాణం ప్రారంభించేందుకు ప్రభుత్వం కార్యాచరణ షెడ్యూల్‌ను జారీ చేసింది.
కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణానికి రూ.990 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేయనుంది.