LOADING...
Andhra News: ఏపీలో ఎండలు మొదలయ్యాయ్‌.. శీతకాలం ముగియకముందే భానుడు ప్రతాపం
ఏపీలో ఎండలు మొదలయ్యాయ్‌.. శీతకాలం ముగియకముందే భానుడు ప్రతాపం

Andhra News: ఏపీలో ఎండలు మొదలయ్యాయ్‌.. శీతకాలం ముగియకముందే భానుడు ప్రతాపం

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 09, 2026
08:38 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లో ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతోంది. ఇంకా శీతాకాలం పూర్తిగా ముగియకముందే సూర్యుడు తన ప్రభావాన్ని చూపుతున్నాడు. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా అత్యధిక ఉష్ణోగ్రత కావలిలో నమోదై, గరిష్ఠంగా 35 డిగ్రీల సెల్సియస్‌కు చేరింది. నరసాపురం, బాపట్ల, ఒంగోలు, కావలి వంటి ప్రాంతాల్లో సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యాయి. రాబోయే రెండు రోజుల పాటు దక్షిణ కోస్తా జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు మరో 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.

వివరాలు 

ఉత్తర కోస్తా ప్రాంతాలు, యానాంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు

అదే సమయంలో ఉత్తర కోస్తా ప్రాంతాలు, యానాంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా ఉండగా, కనిష్ఠ ఉష్ణోగ్రతలు మాత్రం 2 నుంచి 4 డిగ్రీలు తగ్గే అవకాశముందని అంచనా వేసింది. రాయలసీమ ప్రాంతాల్లోనూ కనిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల వరకు తగ్గవచ్చని తెలిపింది. సోమవారం రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో పొగమంచు కమ్ముకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది.

Advertisement