Mobile File to Print: ఫోన్‌తో స్కాన్ చేసిన వెంటనే ప్రింట్లు.. కూకట్‌పల్లి మెట్రో వద్ద కొత్త కియోస్క్
ఈ వార్తాకథనం ఏంటి
ప్రస్తుతం ఎక్కువ మంది తమ అవసరమైన డాక్యుమెంట్లు, ఫోటోలు అన్నీ మొబైల్ ఫోన్‌లలోనే భద్రపరుచుకుంటున్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఫోన్ నుంచే డాక్యుమెంట్లు స్కాన్ చేసి వెంటనే ప్రింట్లు తీసుకునే ప్రత్యేక కియోస్క్ అందుబాటులోకి వచ్చింది. ఇద్దరు యువకులు ఈ సౌకర్యాన్ని చెన్నై నుంచి కొనుగోలు చేసి, హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి మెట్రో స్టేషన్ వద్ద ఏర్పాటు చేశారు. ఈ యంత్రం ద్వారా ఎవరైనా తమ మొబైల్ ఫోన్‌లో ఉన్న ఫైళ్లను నేరుగా అప్‌లోడ్ చేసి ప్రింట్లు తీసుకునే అవకాశం ఉంటుంది. కియోస్క్‌పై ఇచ్చిన 'క్యూఆర్ కోడ్'ను మొబైల్‌తో స్కాన్ చేస్తే ముందుగా 'ఫైల్ అప్‌లోడ్' అనే ఆప్షన్ కనిపిస్తుంది.
వివరాలు
యూపీఐ ద్వారా చెల్లింపు
ఫోన్‌లో ఉన్న అవసరమైన ఫైల్‌ను అప్‌లోడ్ చేసిన తర్వాత తదుపరి దశలో కొన్ని ఎంపికలు కనిపిస్తాయి. అందులో ప్రింట్‌ను కలర్‌లో తీసుకోవాలా లేదా బ్లాక్ అండ్ వైట్‌లో తీసుకోవాలా, అలాగే ఎన్ని కాపీలు కావాలో ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ ఎంపికలను టిక్ చేసిన వెంటనే యూపీఐ పేమెంట్ ఆప్షన్‌లో ఎంత మొత్తం చెల్లించాలో స్క్రీన్‌పై చూపిస్తుంది. నిర్ణయించిన మొత్తాన్ని యూపీఐ ద్వారా చెల్లించిన తర్వాత, మనం నమోదు చేసిన ఫోన్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని కియోస్క్‌లో ఉన్న కీప్యాడ్‌లో నమోదు చేస్తే, యంత్రం వెంటనే మనం కోరుకున్న ప్రింట్లను అందిస్తుంది. దీంతో ఫోన్‌లో ఉన్న డాక్యుమెంట్లను సులభంగా, త్వరగా ప్రింట్ చేసుకునే సౌకర్యం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది.