Gold and Silver Rates: బంగారం,వెండి ధరల్లో స్వల్ప తగ్గుదల.. తాజా రేట్లు ఇవే
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ బులియన్ మార్కెట్‌లో బంగారం,వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. గత కొద్ది రోజులుగా ఇరాన్-ఇజ్రాయెల్, అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా ఈ రెండు విలువైన లోహాల ధరలు స్థిరంగా పెరుగుతూ వచ్చాయి. అయితే తాజాగా నేడు స్వల్పంగా దిగొచ్చాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ వివరాల ప్రకారం, శుక్రవారం ఉదయం 7 గంటల సమయానికి బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల నమోదైంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.10 తగ్గి ప్రస్తుతం రూ.1,62,210కు చేరింది. అదే విధంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.10 మేర పడిపోయి ప్రస్తుతం రూ.1,48,690 వద్ద ట్రేడవుతోంది.
వివరాలు
ప్రధాన నగరాల్లో 24 క్యారెట్లు, 22 క్యారెట్ల బంగారం(10 గ్రాములకు) ధరలు ఇలా..
వెండి ధరల విషయానికి వస్తే, నిన్నటి ధరతో పోలిస్తే కిలో వెండిపై రూ.100 తగ్గుదల నమోదైంది. దీంతో ప్రస్తుతం మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.2,79,900గా కొనసాగుతోంది.
హైదరాబాద్: ₹1,62,210; ₹1,48,690
విజయవాడ: ₹1,62,210; ₹1,48,690
ఢిల్లీ: ₹1,62,360; ₹1,48,840
ముంబై: ₹1,62,210; ₹1,48,690
కోల్‌కతా: ₹1,62,210; ₹1,48,690
చెన్నై: ₹1,63,300;₹1,49,690
బెంగళూరు: ₹1,62,210;₹1,48,690
కేరళం: ₹1,62,210;₹1,48,690
పుణే: ₹1,62,210;₹1,48,690
వెండి రేట్లు(కిలోకు) ఇలా..
హైదరాబాద్: ₹2,89,900
విజయవాడ: ₹2,89,900
ఢిల్లీ: ₹2,79,900
ముంబై: ₹2,79,900
కోల్‌కతా: ₹2,79,900
చెన్నై: ₹2,89,900
బెంగళూరు: ₹2,79,900
కేరళం: ₹2,89,900
పుణే: ₹2,79,900
గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం పాఠకులకు అవగాహన కోసం మాత్రమే. బంగారం, వెండి ధరలు మార్కెట్ పరిస్థితుల ఆధారంగా ఎప్పటికప్పుడు మారుతుంటాయి.