ఇజ్రాయెల్: వార్తలు
Israeli: దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
West Asia: పశ్చిమాసియాను వెంటనే వీడండి.. అమెరికన్లకు అత్యవసర హెచ్చరిక
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), జోర్డాన్, ఇరాక్, ఇజ్రాయెల్ తదితర దేశాల్లోని అమెరికా రాయబార కార్యాలయాలు తమ పౌరులకు అత్యవసర హెచ్చరికలు జారీ చేశాయి.
Gaza: గాజాలో శాంతి పవనాలు.. ఆయుధాలు వీడేందుకు హమాస్ అంగీకారం!
మూడేళ్లుగా కొనసాగుతున్న ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంతో తీవ్ర విధ్వంసాన్ని చవిచూసిన గాజాలో శాంతి నెలకొనే సంకేతాలు కనిపిస్తున్నాయి.ఆయుధాలను విడిచిపెట్టేందుకు హమాస్ అంగీకరించినట్లు అధికారులు శుక్రవారం వెల్లడించారు.
Netanyahu: నన్ను అరెస్ట్ చేస్తే.. ఇజ్రాయెల్ స్పెషల్ ఫోర్స్ రంగంలోకి: నెతన్యాహు
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ICC) జారీ చేసిన అరెస్టు వారంట్ నేపథ్యంలో అమెరికా పర్యటనకు ముందే వివాదం చెలరేగింది.
Trump: గాజాలో హమాస్ నిరాయుధీకరణ ఒప్పందం.. ట్రంప్ కీలక ప్రకటన
గాజాలో శాశ్వత శాంతి నెలకొల్పే దిశగా కీలక పరిణామం చోటు చేసుకుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు.
Israel: ఎఫ్-35 స్థాయి సామర్థ్యాలతో పైలట్ లేని యుద్ధ విమానం తయారీకి ఇజ్రాయెల్ సిద్ధం
అమెరికా అందించిన ఎఫ్-35 స్టెల్త్ యుద్ధ విమానానికి సమానమైన సామర్థ్యాలతో పైలట్ అవసరం లేని అత్యాధునిక యుద్ధ విమానాన్ని అభివృద్ధి చేయాలని ఇజ్రాయెల్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
Trump: రక్షణ ఒప్పందాలపై అమెరికాదే తుది నిర్ణయం: నెతన్యాహుకు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్!
టర్కీకి అధునాతన ఎఫ్-35 యుద్ధ విమానాల విక్రయంపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వ్యక్తం చేసిన అభ్యంతరాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టంగా తిరస్కరించారు.
Iran: అమెరికా-సౌదీ అణు ఒప్పందాన్ని ఇజ్రాయెల్ అడ్డుకుంటుంది: ఇరాన్
అమెరికా, సౌదీ అరేబియా మధ్య కుదిరిన న్యూక్లియర్ ఒప్పందానికి ఇజ్రాయెల్ తప్పకుండా అడ్డంకులు సృష్టిస్తుందని ఇరాన్ పేర్కొంది.
Khamenei: ఇజ్రాయెల్‌కు హెచ్చరిక.. హెజ్‌బొల్లాకు ఖమేనీ బహిరంగ మద్దతు
ఇజ్రాయెల్,అమెరికా ఒత్తిళ్ల మధ్య మరోసారి హెజ్‌బొల్లాకు ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ బహిరంగ మద్దతు ప్రకటించారు.
Iran: ఇరాన్ మరోసారి సంచలనం.. ధ్వంసమైన అణు కేంద్రాల పునర్నిర్మాణం వేగవంతం
అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో తీవ్రంగా దెబ్బతిన్న సైనిక స్థావరాలు, అణు కేంద్రాల పునర్నిర్మాణాన్ని ఇరాన్ వేగంగా కొనసాగిస్తోంది.
Gulf Operation: ఇరాన్‌పై గల్ఫ్ దేశాల సీక్రెట్ ఆపరేషన్?.. బహ్రెయిన్, కువైట్ వైమానిక దాడులపై సంచలన కథనం!
అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఘర్షణలు పశ్చిమాసియాను మరింత ఉద్రిక్తంగా మారుస్తున్నాయి.
Israel: ఇజ్రాయెల్‌లో భారతీయుడి అనుమానాస్పద మృతి.. అదుపులోకి అనుమానితుడు
ఇజ్రాయెల్‌లో ఓ 40 ఏళ్ల భారతీయుడు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందాడు.
Trump: సౌదీ అణు ఒప్పందంపై అమెరికా షరతు.. ఇజ్రాయెల్‌తో బంధాలకే ప్రాధాన్యం
అబ్రహాం ఒప్పందం కింద సౌదీ అరేబియా ఇజ్రాయెల్‌తో సాధారణ దౌత్య సంబంధాలు నెలకొల్పాల్సి ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు.
Israel: గాజా సరిహద్దులో భారీ మట్టిగోడ.. ఇజ్రాయెల్ వ్యూహంపై ఆందోళనలు
ఇరాన్‌తో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ మరోవైపు గాజా ప్రాంతంలో ఇజ్రాయెల్ తన వ్యూహాన్ని మరింత వేగవంతం చేస్తోంది.
Pickaxe Mountain: పికాక్స్ పర్వతానికి వేలాది అణు సెంట్రిఫ్యూజ్‌లు తరలించిన ఇరాన్!
ఇరాన్ అణ్వాయుధాల అభివృద్ధిని అడ్డుకునేందుకు అమెరికా, ఇజ్రాయెల్ చేపడుతున్న చర్యలు ఆశించిన స్థాయిలో ఫలించడం లేదని తాజా పరిణామాలు సూచిస్తున్నాయి.
Hamas: హమాస్‌కు కొత్త అధినేతగా ఖలీల్ అల్ హయ్యా
గాజాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న మిలిటెంట్ సంస్థ హమాస్‌కు కొత్త అధినేతగా ఖలీల్ అల్ హయ్యా ఎన్నికయ్యారు.
Israel: అక్టోబర్ 27న ఇజ్రాయెల్ సార్వత్రిక ఎన్నికలు.. యుద్ధ వాతావరణంలో ఓటర్ల తీర్పుకు సిద్ధమైన నెతన్యాహు
ఒకవైపు యుద్ధ పరిస్థితులను ఎదుర్కొంటూనే, మరోవైపు ప్రజల తీర్పును స్వీకరించేందుకు ఇజ్రాయెల్ ప్రభుత్వం సిద్ధమవుతోంది.
Iran: ప్రపంచానికి మళ్లీ ముప్పు? ఇరాన్ సీక్రెట్ ఆపరేషన్‌పై పెరుగుతున్న అనుమానాలు
అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడుల అనంతరం ఇరాన్ నిశ్శబ్దంగా మరో కీలక కార్యాచరణను ప్రారంభించిందా?
US Iran War : హర్ముజ్ జలసంధిని అంతర్జాతీయ మార్గంగా ప్రకటించాల్సిందే.. అమెరికా హెచ్చరిక..
ప్రపంచ చమురు, సహజ వాయువు రవాణాలో అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధిపై ఇరాన్ పూర్తి నియంత్రణ కోరుతున్న నేపథ్యంలో అమెరికా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
Israel: ట్రంప్ హత్యకు ఇరాన్ కొత్త కుట్ర? అమెరికాను హెచ్చరించిన ఇజ్రాయెల్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను హత్య చేయడానికి ఇరాన్ కొత్త కుట్రకు సంబంధించిన సమాచారం తమకు లభించినట్లు ఇజ్రాయెల్ అమెరికాను హెచ్చరించినట్లు అమెరికా మీడియా కథనాలు వెల్లడించాయి.
Khamenei: నేడే ఖమేనీకి అంతిమ వీడ్కోలు
అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త వైమానిక దాడుల్లో ఫిబ్రవరి 28న ప్రాణాలు కోల్పోయిన ఇరాన్ సుప్రీం నాయకుడు, 86 ఏళ్ల ఆయతుల్లా అలీ ఖమేనీకి గురువారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
Iran: ఖమేనీ అంత్యక్రియల్లో ప్రతీకార జ్వాలలు.. ట్రంప్, నెతన్యాహును చంపాలంటూ నినాదాలు!
ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ అంత్యక్రియల ప్రార్థనల సందర్భంగా రాజధాని టెహ్రాన్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Netanyahu: భారత్ వంటి మిత్రదేశాలు మాకు ఉన్నాయి.. జేడీ వాన్స్‌కు నెతన్యాహు కౌంటర్
ఇజ్రాయెల్‌కు అమెరికా మాత్రమే ఏకైక మిత్రదేశమన్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వ్యాఖ్యలకు ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పందించారు.
Donald Trump: నెతన్యాహుపై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు.. "బాస్ ఎవరో ఆయనకు తెలుసు"
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తనదైన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.
USA: 'మేం సానుకూలంగా వ్యవహరించాం కాబట్టే విరామం ఇచ్చాం' : ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై అమెరికా చేపట్టిన సైనిక చర్యలను ప్రస్తావిస్తూ, ఆ దేశంపై తీవ్రస్థాయిలో దాడులు నిర్వహించామని పేర్కొన్నారు.
Israel vs Iran : 'ఆ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు'.. న్యూయార్క్ టైమ్స్ కథనాన్ని తోసిపుచ్చిన ఇజ్రాయెల్
ఇరాన్‌తో జరుగుతున్న శాంతి చర్చల్లో పాల్గొన్న కీలక నాయకులను హత్య చేయాలనే ప్రణాళికను ఇజ్రాయెల్ రూపొందించిందంటూ అమెరికాకు చెందిన న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన కథనాన్ని ఇజ్రాయెల్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది.
Iran: ఇరాన్ అగ్రనేతలను హత్యా చేసేందుకు ఇజ్రాయెల్ స్కెచ్.. అలర్ట్ చేసిన అమెరికా!
ఇరాన్-అమెరికా మధ్య కొనసాగుతున్న అత్యంత కీలకమైన శాంతి చర్చలను భంగపరిచే ఉద్దేశంతో ఇజ్రాయెల్ సంచలన ప్రణాళిక రూపొందించిందని ప్రముఖ అంతర్జాతీయ పత్రిక ది న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది.
Syria: సిరియాలో ఇజ్రాయెల్ సైనికుల ప్రవేశం.. ఆబ్డీన్‌లో ఉద్రిక్త పరిస్థితులు
సిరియాలోని ఆబ్డీన్ పట్టణంలో ఇజ్రాయెల్ సైనికులు మరోసారి ప్రవేశించడం ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది.
Israel: హిజ్బుల్లా భారీ ఆయుధ సొరంగాన్ని పేల్చివేసిన ఇజ్రాయెల్
అమెరికా మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందానికి తొలి ఎదురుదెబ్బ తగిలింది.
Israel - Lebanon: శాంతి చర్చల్లో ఇజ్రాయెల్-లెబనాన్..ఇరుపక్షాల అంగీకారం
గత కొంతకాలంగా ఇజ్రాయెల్ సైన్యం, లెబనాన్‌కు చెందిన మిలిటెంట్ సంస్థ హెజ్‌బొల్లా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.
Strait of Hormuz: హర్మూజ్ మీ క్యాసినో కాదు.. ట్రంప్‌కు ఇరాన్ నేత ఘాటు హెచ్చరిక
లెబనాన్‌లోని హెజ్‌బొల్లా ఇజ్రాయెల్‌పై దాడులు చేయకుండా అడ్డుకోవాలని, లేనిపక్షంలో ఇరాన్‌పై తీవ్ర స్థాయిలో సైనిక చర్యలు చేపడతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించిన నేపథ్యంలో ఇరాన్ నుంచి గట్టి ప్రతిస్పందన వచ్చింది.
Iran policy: ఇరాన్‌పై ట్రంప్ వైఖరికి అమెరికాలో పెరుగుతున్న వ్యతిరేకత
ఇరాన్‌తో జరిగిన ఘర్షణ అనంతరం కుదిరిన అమెరికా-ఇరాన్ ఒప్పందంపై ఇజ్రాయెల్ ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొన్నట్లు తాజా సర్వే వెల్లడించింది.
Hormuz: హోర్ముజ్ జలసంధిని మళ్ళీ మూసేస్తున్నాం: ఇరాన్ సంచలన ప్రకటన
అమెరికా, ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించాయని ఆరోపిస్తూ ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిని నౌకల రాకపోకలకు మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది.
UN: ఐరాస వేదికపై ఇజ్రాయెల్ రాయబారి ఆగ్రహం.. 'నోరు మూసుకోండి.. లేదంటే బయటకు వెళ్లండి!'
ఐక్యరాజ్య సమితి (UN) వేదికపై దౌత్య మర్యాదలు పక్కనపడ్డాయి.
Israel-Hezbollah: ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణ.. శుక్రవారం నుంచి అమల్లోకి ఒప్పందం
మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది.
Strait of Hormuz: మళ్లీ హోర్ముజ్ జలసంధిని మూసేసిన ఇరాన్.. అమెరికాతో అణు చర్చలకు బ్రేక్!
మధ్యప్రాచ్యంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికాతో అణు చర్చలు జరగాల్సిన వేళ, ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది.
JD Vance: ఇజ్రాయెల్‌కు జేడీ వాన్స్ హెచ్చరిక.. ట్రంప్‌ను విమర్శిస్తే నష్టమే!
అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక శాంతి ఒప్పందం ప్రపంచ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది.
Trump to Netanyahu: బీబీకి దక్కిన 'బెస్ట్ డీల్' ఇదేనా!?.. ట్రంప్ వ్యాఖ్యలపై ప్రపంచవ్యాప్తంగా చర్చ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.
Iran: లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ వైదొలగితేనే అమెరికాతో ఒప్పందం: ఇరాన్
అమెరికాతో శాంతి ఒప్పందం కుదరాలంటే లెబనాన్‌లో ఆక్రమించిన ప్రాంతాల నుంచి ఇజ్రాయెల్ సైన్యం పూర్తిగా వైదొలగాలని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఖ్చీ స్పష్టం చేశారు.
Gaza: ఆగని ఇజ్రాయెల్ దాడులు.. గాజాలో 73 వేల మందికి పైగా మృతి
గతేడాది అక్టోబర్‌లో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్నప్పటికీ గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.
Fact Check: 7 నెలల పాలస్తీనా చిన్నారి హత్య కేసులో కొత్త ట్విస్ట్.. వీడియోతో ఐడీఎఫ్‌కు షాక్!
వెస్ట్ బ్యాంక్‌లో ఏడు నెలల పాలస్తీనా చిన్నారి సామ్ ఫహద్ అబు హైకల్ మృతి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
US: అపాచీ హెలికాప్టర్ కూల్చివేతకు ప్రతీకారం.. ఇరాన్‌పై అమెరికా భారీ వైమానిక దాడులు
అమెరికా ఆర్మీకి చెందిన అపాచీ హెలికాప్టర్‌ను కూల్చివేసినందుకు ప్రతీకారంగా అమెరికా బలగాలు ఇరాన్‌పై వైమానిక దాడులు ప్రారంభించాయి
Iran deal: 3 నెలల్లో 37 సార్లు అదే మాట.. ఇరాన్ డీల్‌పై ట్రంప్ ప్రకటనలు ఫలించాయా?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో శాంతి ఒప్పందం త్వరలోనే కుదురుతుందని వరుసగా ప్రకటిస్తున్నప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి స్పష్టమైన ఫలితం కనిపించలేదు.
'In Spirit Of Friendship':ఇజ్రాయెల్‌లో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం.. మరాఠా-యూదుల చారిత్రక బంధానికి గుర్తింపు
మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ వైభవం మరోసారి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందనుంది.
Israel: మిత్ర దేశాల మధ్య ఉద్రిక్తతలు.. ఇజ్రాయెల్‌కు అత్యున్నత గూఢచర్య హెచ్చరిక
అమెరికా గూఢచార సంస్థలు ఇజ్రాయెల్‌కు సంబంధించిన థ్రెట్ లెవల్‌ను అత్యున్నత స్థాయి "క్రిటికల్"కు పెంచినట్లు సమాచారం వెలుగులోకి వచ్చింది.
Iran-Israel: ఇరాన్‌పై ఇజ్రాయెల్ భారీ దాడులు.. ట్రంప్ హెచ్చరికలను పట్టించుకోని నెతన్యాహు
ఇరాన్ (Iran) - ఇజ్రాయెల్ (Israel) మధ్య ఏప్రిల్ 8 తర్వాత మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Abbas Araghchi:దాడి సమయంలో ఖమేనీ కార్యాలయంలోనే ఉన్నా.. : అబ్బాస్ అరాగ్చీ
అమెరికా-ఇజ్రాయెల్‌లు ఫిబ్రవరి 28న ఇరాన్‌పై నిర్వహించిన దాడిలో అప్పటి సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
Israel and Lebanon: ఇజ్రాయెల్-లెబనాన్ కాల్పుల విరమణకు అంగీకారం.. అమెరికా మధ్యవర్తిత్వంతో కీలక ఒప్పందం
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను చల్లార్చే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది.
Bab el-Mandeb Strait: హోర్ముజ్ తర్వాత బాబ్ ఎల్-మండెబ్‌పైనా ఇరాన్ కన్ను.. ప్రపంచ వాణిజ్యానికి మరో భారీ ముప్పు!
అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు మరింత ప్రమాదకర దశకు చేరుకుంటున్నాయి.
Iran-US Talks: అమెరికాతో చర్చలు నిలిపివేసిన ఇరాన్.. వచ్చే వారంలో ఒప్పందం కుదురుతుందన్న ట్రంప్
లెబనాన్‌లో ఇజ్రాయెల్ సైనిక చర్యలకు నిరసనగా అమెరికాతో జరుగుతున్న చర్చలను ఇరాన్ తాత్కాలికంగా నిలిపివేసింది.
Trump: మధ్యప్రాచ్యంలో శాంతి సంకేతాలు.. ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం
మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను చల్లార్చే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది.
Israel: లెబనాన్‌లోని బ్యూఫోర్ట్ క్యాజిల్‌ను స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్
దక్షిణ లెబనాన్‌లోని కీలక వ్యూహాత్మక ప్రాంతమైన బ్యూఫోర్ట్ కోటను ఇజ్రాయెల్ సైన్యానికి చెందిన గోలానీ బ్రిగేడ్ దళాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి.
Trump: ఇరాన్‌తో ఒప్పందానికి చేరువలో ఉన్నాం: ట్రంప్
అమెరికా-ఇరాన్ మధ్య జరుగుతున్న చర్చలు సానుకూల దిశగా సాగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు.
Oil Prices: లెబనాన్‌లో ఇజ్రాయెల్ దాడులు తీవ్రం.. 2.5%కుపైగా పెరిగిన ముడి చమురు ధరలు
లెబనాన్‌లో ఇజ్రాయెల్ సైనిక చర్యలు మరింత తీవ్రతరం కావడంతో అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి.