Loading...
Dimona nuclear site: ఇజ్రాయెల్‌ డిమోనా అణుకేంద్రంపై ఇరాన్ గురి.. 
ఇజ్రాయెల్‌ డిమోనా అణుకేంద్రంపై ఇరాన్ గురి..

Dimona nuclear site: ఇజ్రాయెల్‌ డిమోనా అణుకేంద్రంపై ఇరాన్ గురి.. 

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 06, 2026
12:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇజ్రాయెల్‌ ఒక్క అణు రియాక్టర్‌ కోసం గతంలో అమెరికానే మోసం చేసింది. అది దాని అణు కార్యక్రమానికి గుండెకాయ వంటిది అగ్రరాజ్యం కళ్లుగప్పి ఫ్రాన్స్‌ సహకారంతో నిర్మించిన ఈ అణుకేంద్రం ప్రస్తుతం ఇరాన్‌ లక్ష్యంగా మారే అవకాశాలపై చర్చ జరుగుతోంది. ఇజ్రాయెల్‌ ఏర్పడిన తర్వాత దాని పొరుగు దేశాలు వరుసగా యుద్ధాలకు దిగాయి. అమెరికా మద్దతుతో ఆ యుద్ధాల్లో గెలిచినప్పటికీ, ఎప్పటికైనా తన ఉనికికి ప్రమాదం ఎదురవుతుందనే ఆందోళన ఇజ్రాయెల్‌ నాయకత్వంలో పెరిగింది. దీంతో అప్పటి ప్రధాని డేవిడ్‌ బెన్‌ గురియన్‌ దేశాన్ని అణుశక్తిగా మార్చాలని నిర్ణయించారు. దేశంలోని నెగెవ్‌ ఎడారిలో యురేనియం నిల్వల కోసం విస్తృతంగా అన్వేషణ చేసినా వాటి ఆనవాళ్లు కనిపించలేదు.

వివరాలు 

భారజల అణు రియాక్టర్‌ నిర్మాణానికి రహస్యంగా ఫ్రాన్స్‌ అంగీకారం 

1950లలో ఇజ్రాయెల్‌ అటామిక్‌ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. 1956లో సూయజ్‌ కాలువ సంక్షోభం తరువాత అమెరికాపై అసంతృప్తి పెరగడంతో ఇజ్రాయెల్‌, ఫ్రాన్స్‌ దేశాలు మరింత దగ్గరయ్యాయి.

ఈ నేపథ్యంలో భారజల అణు రియాక్టర్‌ నిర్మాణానికి రహస్యంగా ఫ్రాన్స్‌ అంగీకరించింది.

అయితే ఈ ఒప్పందం గురించి ఫ్రాన్స్‌ ప్రజలకు కూడా తెలియనివ్వలేదు.

తరువాత ఫ్రాన్స్‌లో ప్రభుత్వం మారి చార్లెస్‌ డి గాల్‌ అధికారంలోకి వచ్చినప్పుడు ఈ ఒప్పందం గురించి తెలిసి ఆయన ఆశ్చర్యపోయారు.

అప్పటికే రియాక్టర్‌కు అవసరమైన ముఖ్యమైన టెక్నాలజీ ఇజ్రాయెల్‌కు చేరిపోయింది.

ఆ సమయంలో డీల్‌ను రద్దు చేస్తే ఫ్రాన్స్‌కు చెందిన కంపెనీలు భారీ నష్టాల్లో పడే అవకాశం ఉండటంతో ఆయన ఆ నిర్ణయాన్ని మార్చలేకపోయారు.

వివరాలు 

నెగెవ్‌ ఎడారిలోని 'డిమోనా' ప్రాంతంలో ఇజ్రాయెల్‌ భారీ అణు రియాక్టర్‌ నిర్మాణం 

తర్వాత నెగెవ్‌ ఎడారిలోని 'డిమోనా' ప్రాంతంలో ఇజ్రాయెల్‌ భారీ అణు రియాక్టర్‌ను నిర్మించింది.

యూరప్‌ దేశాల టెక్నాలజీ,బ్లూప్రింట్లు,నిపుణుల సహకారంతో ఈ కేంద్రాన్ని అభివృద్ధి చేశారు.

ఇందులోని భూగర్భ బంకర్లలో అణుబాంబుల తయారికి అవసరమైన ప్లుటోనియంను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉందని చెబుతారు.

ఈ సమాచారం చాలా కొద్దిమందికే తెలిసింది. దీంతో ఇది కేవలం అణు విద్యుత్తు ఉత్పత్తి కోసం మాత్రమే కాదని స్పష్టమైంది.

ఈ భారీ కాంక్రీట్‌ డోమ్‌ ఉన్న భవనాన్ని అమెరికా నిఘా విమానాలు ఫోటోలు తీశాయి.

అయితే మొదట్లో ఇది ఒక టెక్స్‌టైల్‌ ఫ్యాక్టరీ అని ఇజ్రాయెల్‌ అమెరికాను నమ్మబలికింది. కానీ సీఐఏ ఆ చిత్రాలను విశ్లేషించి అది అణు రియాక్టర్‌ అని గుర్తించింది.

ADVERTISEMENT

వివరాలు 

పశ్చిమాసియాలో కొత్త ఆయుధాలను ప్రవేశపెట్టబోమని అమెరికాకు ఇజ్రాయెల్‌ హామీ

ఈ సమాచారం అప్పటి అమెరికా అధ్యక్షుడు జాన్‌ ఎఫ్‌. కెనడీకి చేరింది.

దీంతో అమెరికా అధికారులు తనిఖీలు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని ఇజ్రాయెల్‌పై ఒత్తిడి తీసుకొచ్చారు.

అయితే ఇజ్రాయెల్‌ తనిఖీలకు కాకుండా కేవలం 'సందర్శన'కు మాత్రమే అనుమతించింది.

అంతేకాకుండా పశ్చిమాసియాలో కొత్త ఆయుధాలను ప్రవేశపెట్టబోమని అమెరికాకు హామీ ఇచ్చి ఆ దేశ తనిఖీ బృందాన్ని తప్పుదోవ పట్టించింది.

ఇదే సమయంలో శుద్ధి చేసిన యురేనియం కోసం అమెరికాలోని అపొలో పట్టణంలో ఉన్న న్యుమెక్‌ (న్యూక్లియర్‌ మెటీరియల్‌ అండ్‌ ఎక్విప్‌మెంట్‌ కార్పొరేషన్‌) సంస్థను ఇజ్రాయెల్‌ ఏజెంట్లు పలుమార్లు సందర్శించారు.

అక్కడి నుంచి విడతల వారీగా సుమారు 200 నుంచి 600 పౌండ్ల వరకు శుద్ధి చేసిన యురేనియంను గోప్యంగా సేకరించారు.

ADVERTISEMENT

వివరాలు 

సాధారణ యురేనియం కోసం 'ఆపరేషన్‌ ప్లమ్‌బాట్‌' పేరుతో రహస్య చర్య

అదే సమయంలో సాధారణ యురేనియం కోసం 'ఆపరేషన్‌ ప్లమ్‌బాట్‌' పేరుతో మరో రహస్య చర్య చేపట్టారు.

ఈ ఆపరేషన్‌లో సముద్రంలో ప్రయాణిస్తున్న ఓ నౌక నుంచి సుమారు 200 టన్నుల ముడి యురేనియంను దారి మళ్లించారు.

ఈ విధంగా డిమోనా రియాక్టర్‌ ఇజ్రాయెల్‌ అణ్వాయుధ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించింది.

వివరాలు 

దీనిపై దాడి జరిగితే చుట్టుపక్కల దేశాలపై ప్రభావం

డిమోనా రియాక్టర్‌కు ఉత్తర దిశలో సుమారు 85కిలోమీటర్ల దూరంలో జెరూసలెం నగరం ఉంది.

అలాగే దాదాపు 75కిలోమీటర్ల దూరంలో ఈజిప్ట్‌ సరిహద్దులు,25కిలోమీటర్ల దూరంలో జోర్డాన్‌ దేశం ఉన్నాయి.

ఒకవేళ ఈ రియాక్టర్‌పై దాడి జరిగి రేడియేషన్‌ లీక్‌ అయితే దాని ప్రభావం ఈప్రాంతాలకూ వ్యాపించే ప్రమాదం ఉంది.

ఇజ్రాయెల్‌ ఈకేంద్రాన్ని కట్టుదిట్టంగా రక్షించేందుకు అత్యాధునిక రక్షణ వ్యవస్థలను మోహరించింది.

ప్రపంచంలోనే అత్యంత భద్రత కలిగిన ప్రదేశాల్లో ఒకటిగా దీన్ని మార్చింది.

ఇక్కడ యారో-2,యారో-3,డేవిడ్‌ స్లింగ్‌ వంటి క్షిపణి నిరోధక వ్యవస్థలు ఉన్నాయి.

అదనంగా తాజాగా అభివృద్ధి చేసిన ఐరన్‌ బీమ్‌ రక్షణవ్యవస్థను కూడా ఇక్కడికి తరలించినట్లు సమాచారం.

అంతేకాకుండా భూగర్భంలో అనేక అంతస్తుల లోతులో ఇజ్రాయెల్‌ తన అణు కార్యక్రమాన్ని భద్రపరిచినట్లు తెలుస్తోంది.

వివరాలు 

ఇరాన్‌ వద్ద ఉన్న ఆయుధాలు ఏమిటి?

డిమోనాపై దాడి చేయాలంటే ఇరాన్‌కు డ్రోన్లు,క్షిపణులు వంటి అనేక రకాల ఆయుధాలు అందుబాటులో ఉన్నాయి.

డిమోనా రియాక్టర్‌ నుంచి ఇరాన్‌ దూరం సుమారు 1200 నుంచి 1500 కిలోమీటర్ల వరకు ఉంటుంది.

ఈ దూరాన్ని చేరుకునే సామర్థ్యం ఉన్న షహీద్‌-136 డ్రోన్లు ఇరాన్‌ వద్ద పెద్ద సంఖ్యలో ఉన్నాయి.

ఒక్కో డ్రోన్‌ దాదాపు 50 కిలోల పేలుడు పదార్థాన్ని మోసుకెళ్లగలదు.

వివరాలు 

ఇరాన్‌ వద్ద ఉన్న ఆయుధాలు ఏమిటి?

ఇక క్షిపణుల విషయంలో సాహబ్-3, ఖైబర్‌షేకన్‌, ఎమాద్‌, ఖుర్రంషహర్‌, ఘద్ర, సెజ్జిల్‌, సుమర్‌ వంటి మిసైళ్లను ఇరాన్‌ అభివృద్ధి చేసింది.

వీటి పరిధి సుమారు 1300 కిలోమీటర్ల నుంచి 2500 కిలోమీటర్ల వరకు ఉంటుంది.

అంతేకాకుండా ఫతా-2 అనే హైపర్‌సోనిక్‌ క్షిపణి కూడా ఇరాన్‌ వద్ద ఉంది.

ఇది ఇజ్రాయెల్‌ గగనతల రక్షణ వ్యవస్థలను తప్పించుకుని లక్ష్యాన్ని చేరుకునే సామర్థ్యం కలిగి ఉందని చెబుతారు.

గతంలో సిరియాతో జరిగిన ఉద్రిక్తతల సమయంలో ఈ రియాక్టర్‌ సమీపంలో కొన్ని క్షిపణులు పడిన ఘటనలు కూడా నమోదయ్యాయి.

ADVERTISEMENT