Israel strikes Lebanon: లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు.. 50 గ్రామాలు ఖాళీ చేయాలని ప్రజలకు హెచ్చరిక
ఈ వార్తాకథనం ఏంటి
లెబనాన్‌లో ఇరాన్ మద్దతుతో కొనసాగుతున్న హెజ్‌బొల్లా మిలిటెంట్ సంస్థ స్థావరాలపై దాడులకు ఇజ్రాయెల్ సిద్ధమైంది. ఈ నేపథ్యంలో సరిహద్దు పరిసర ప్రాంతాల్లోని సుమారు 50 గ్రామాల ప్రజలు వెంటనే తమ ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఇజ్రాయెల్ హెచ్చరికలు జారీ చేసింది. ఇంతకుముందు రాజధాని బీరుట్‌పై కూడా ఇజ్రాయెల్ క్షిపణి దాడులు జరిపింది. ఈ దాడుల్లో పలు భవనాల కిటికీలు ధ్వంసమయ్యాయి. ఒక నివాస గృహంలో మంటలు చెలరేగినట్లు సమాచారం. దీంతో అక్కడి ప్రజల్లో ఆందోళన నెలకొంది.
వివరాలు
లెబనాన్ ఇంకా కోలుకోలేదు
ఖమేనీ మృతికి ప్రతీకారంగా హెజ్‌బొల్లా మిలిటెంట్ సంస్థ ఇజ్రాయెల్ సరిహద్దు వైపు క్షిపణులను ప్రయోగించింది. దీనికి ప్రతిగా ఇజ్రాయెల్ లెబనాన్‌పై ప్రతిదాడులు చేపట్టింది. తమ గగనతలంలోకి వచ్చిన ఒక క్షిపణిని నేలకూల్చినట్లు ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. ఇక ఇరాన్‌కు మద్దతుగా ఇజ్రాయెల్‌పై మరిన్ని దాడులు చేయవద్దని హెజ్‌బొల్లా మిలిటెంట్ సంస్థను లెబనాన్ ప్రభుత్వ అధికారులు కోరారు. 2024లో ఇజ్రాయెల్ నిర్వహించిన దాడుల ప్రభావం నుంచి లెబనాన్ ఇంకా పూర్తిగా కోలుకోలేదని విశ్లేషకులు అంటున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
లెబనాన్‌లో 50 గ్రామాలను ఖాళీ చేయమని ఇజ్రాయెల్ వార్నింగ్
Israel Defence Forces posts, "In response to projectile fire toward northern Israel, the IDF is striking Hezbollah targets across Lebanon. Hezbollah is operating on behalf of the Iranian regime, opening fire against the Israeli civilians, and bringing ruin to Lebanon. IDF troops… pic.twitter.com/7IdMihXjl9
— Press Trust of India (@PTI_News) March 2, 2026