LOADING...
BrahMos Deal: బ్రహ్మోస్‌పై ఇండోనేషియా ఆసక్తి.. త్వరలో భారత్‌తో కొనుగోలు ఒప్పందం!
బ్రహ్మోస్‌పై ఇండోనేషియా ఆసక్తి.. త్వరలో భారత్‌తో కొనుగోలు ఒప్పందం!

BrahMos Deal: బ్రహ్మోస్‌పై ఇండోనేషియా ఆసక్తి.. త్వరలో భారత్‌తో కొనుగోలు ఒప్పందం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 10, 2026
08:55 am

ఈ వార్తాకథనం ఏంటి

క్రూజ్ క్షిపణి బ్రహ్మోస్ కొనుగోలు చేసే దిశగా ముందడుగు వేస్తోంది. రక్షణ వర్గాల సమాచారం ప్రకారం ఈ కొనుగోలుకు సంబంధించిన ఫైనాన్సింగ్ ప్రక్రియను ఇండోనేషియా ఒక బ్యాంక్ ద్వారా నిర్వహిస్తోంది. బ్యాంకుతో సంబంధిత పత్రాల ప్రక్రియ పూర్తయిన తర్వాత వచ్చే రెండు నుంచి మూడు నెలల్లో భారత్-ఇండోనేషియా మధ్య అధికారిక ఒప్పందం కుదిరే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం మొదటి దశలో ఇండోనేషియా బ్రహ్మోస్ క్షిపణి ఒక బ్యాటరీను కొనుగోలు చేయాలని నిర్ణయించింది.

Details

ఈ క్షిపణిని తీసుకునే రెండో దేశంగా ఇండోనేషియా

అనంతరం అవసరాన్ని బట్టి దానిని దశలవారీగా పెంచే ప్రణాళిక కూడా ఉందని సమాచారం. ఈ ఒప్పందం అమల్లోకి వస్తే ఇప్పటికే బ్రహ్మోస్ కొనుగోలు చేసిన ఫిలిప్పీన్స్ తర్వాత ఈ క్షిపణిని తీసుకునే రెండో దేశంగా ఇండోనేషియా నిలుస్తుంది. గ‌తేడాది నవంబర్‌లో ఇండోనేషియా రక్షణ మంత్రి స్యాఫ్రి స్యామ్‌సోయెద్దీన్ భారత్‌ను సందర్శించారు. ఆ సందర్భంగా ఆయన బ్రహ్మోస్ క్షిపణి తయారీ కేంద్రాన్ని పరిశీలించారు. భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆయనకు బ్రహ్మోస్ క్షిపణి మోడల్‌ను బహుమతిగా అందజేశారు.

Details

2022లో మూడు బ్యాటరీల కొనుగోలు

ఆ పర్యటన తర్వాత ఈ కొనుగోలు ప్రక్రియ వేగం అందుకుంది. ఇప్పటికే ఫిలిప్పీన్స్ 2022లో బ్రహ్మోస్ క్షిపణి మూడు బ్యాటరీలను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇండోనేషియా కూడా అదే దారిలో ముందుకు సాగుతోంది. బ్రహ్మోస్ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్‌సోనిక్ క్రూజ్ క్షిపణిగా పేరుగాంచింది. ఎగుమతి వర్షన్ సుమారు 290 కిలోమీటర్ల దూరం వరకు లక్ష్యాలను చేధించగలదు. యాంటీ-షిప్ దాడులు, భూభాగ లక్ష్యాలపై దాడులు, తీర రక్షణ వంటి అనేక రకాల మిషన్లలో దీనిని ఉపయోగించవచ్చు. శబ్ద వేగానికి దాదాపు మూడు రెట్లు అధిక వేగంతో ప్రయాణించే ఈ క్షిపణిని భారత్-రష్యా సంయుక్త భాగస్వామ్యంతో అభివృద్ధి చేశారు.

Advertisement