'Murdered in cold blood': ఇరాన్‌లో బాలికల స్కూల్‌పై దాడి.. 165 మంది మృతి
ఈ వార్తాకథనం ఏంటి
ఇరాన్‌లోని మినాబ్ ప్రాంతంలో జరిగిన దాడి ఘటనపై అక్కడి మీడియా సంచలన వివరాలు వెల్లడించింది. ప్రాథమిక పాఠశాలపై జరిగిన ఈ దాడిలో మృతుల సంఖ్య 165కి చేరిందని వెల్లడించింది. దక్షిణ ఇరాన్‌లోని హోర్మోజ్‌గాన్ ప్రావిన్స్‌లో ఉన్న మినాబ్ పట్టణంలోని షాజారే తయ్యిబె బాలికల ప్రాథమిక పాఠశాలపై శనివారం దాడి జరిగినట్లు సమాచారం. ఈ ఘటనలో 96 మంది గాయపడినట్టు ఐఆర్ఎన్ఏ వార్తా సంస్థ తెలిపింది. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
వివరాలు
ట్విట్టర్‌లో దాడికి సంబంధించిన ఫోటో పంచుకున్న మంత్రి
దాడి జరిగిన ప్రాంతంలో శోధన, రక్షణ చర్యలను పూర్తిచేశామని మినాబ్ కౌంటీ గవర్నర్ వెల్లడించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశంపై అధికారులు స్పష్టత ఇవ్వలేదు. అయితే బాలికల పాఠశాలపై దాడి జరిగిందనే వార్తలను ఇజ్రాయెల్ ఖండించింది. ఈ నివేదికలను పరిశీలిస్తున్నామని పేర్కొంది. ఇదిలా ఉండగా, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి ట్విట్టర్‌లో దాడికి సంబంధించిన ఒక ఫోటోను పంచుకున్నారు. శనివారం ఇజ్రాయిల్, అమెరికా కలిసి ఇరాన్‌పై ఉమ్మడి దాడి ప్రారంభించాయి. ఆ దాడిలో ఇరాన్ సుప్రీం నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీతో పాటు పలువురు సీనియర్ సైనికాధికారులు మరణించినట్టు వార్తలు వెలువడ్డాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
దాడికి సంబంధించిన ఫోటోను పంచుకున్న అబ్బాస్ అరఘ్చి విదేశాంగ మంత్రి
These are graves being dug for more than 160 innocent young girls who were killed in the US-Israeli bombing of a primary school. Their bodies were torn to shreds.
— Seyed Abbas Araghchi (@araghchi) March 2, 2026
This is how "rescue" promised by Mr. Trump looks in reality.
From Gaza to Minab, innocents murdered in cold blood. pic.twitter.com/cRdJ3BELOn