LOADING...
PM Modi: పౌరుల భద్రతే ప్రాధాన్యం.. ఇజ్రాయెల్ ప్రధానికి మోదీ ఫోన్
పౌరుల భద్రతే ప్రాధాన్యం.. ఇజ్రాయెల్ ప్రధానికి మోదీ ఫోన్

PM Modi: పౌరుల భద్రతే ప్రాధాన్యం.. ఇజ్రాయెల్ ప్రధానికి మోదీ ఫోన్

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 02, 2026
03:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులపై భారత ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా పౌరుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని మోదీ కోరారు. అలాగే కొనసాగుతున్న ఘర్షణలను సాధ్యమైనంత త్వరగా ముగించాల్సిన అవసరాన్ని పునరుద్ఘాటించారు. తమ మధ్య జరిగిన సంభాషణ వివరాలను మోదీ 'ఎక్స్' వేదికగా పంచుకున్నారు. ఇదిలా ఉండగా, ఆదివారం రాత్రి భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ సమావేశానికి మోదీ అధ్యక్షత వహించారు. దేశ భద్రత, వ్యూహాత్మక అంశాలపై నిర్ణయాలు తీసుకునే అత్యున్నత కమిటీ ఇదే.

Details

యూఏఈ అధ్యక్షుడితో మోదీ చర్చ

పశ్చిమాసియాలో జరుగుతున్న ఘర్షణల ప్రభావం, వాటి వల్ల తలెత్తే పరిణామాలపై ఈ భేటీలో సమగ్రంగా చర్చించినట్లు సమాచారం. అమెరికా-ఇజ్రాయెల్‌పై ఇరాన్ ప్రతీకార దాడులు కొనసాగిస్తున్న నేపథ్యంలో, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌పై కూడా క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించినట్టు సమాచారం. ఈ పరిణామాల కారణంగా ఆ దేశంలో ఉన్న పలువురు భారతీయులు చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ, యూఏఈ అధ్యక్షుడు మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తో ఫోన్‌లో మాట్లాడారు. ఇరాన్ దాడులను ఖండించిన ఆయన, యూఏఈకి భారతదేశం పూర్తి మద్దతుగా ఉంటుందని స్పష్టం చేశారు. అంతేకాక, యూఏఈలో ఉన్న భారతీయులను జాగ్రత్తగా చూసుకుంటున్నందుకు షేక్ మహమ్మద్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement