LOADING...
Air india: పశ్చిమాసియా ఉద్రిక్తతల మధ్య ఎయిరిండియా కీలక నిర్ణయం.. 9 మార్గాల్లో అదనపు విమానాలు
9 మార్గాల్లో అదనపు విమానాలు

Air india: పశ్చిమాసియా ఉద్రిక్తతల మధ్య ఎయిరిండియా కీలక నిర్ణయం.. 9 మార్గాల్లో అదనపు విమానాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 09, 2026
11:56 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా-ఇజ్రాయెల్‌, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం ప్రభావంతో పశ్చిమాసియా ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో వేలాది మంది భారతీయ ప్రయాణికులకు కొంత ఉపశమనం కలిగించేలా ఎయిర్ ఇండియా ముఖ్య ప్రకటన చేసింది. తొమ్మిది అంతర్జాతీయ మార్గాల్లో అదనపు విమాన సర్వీసులను ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. మార్చి 10 నుంచి మార్చి 18 వరకు మొత్తం 78 అదనపు విమానాలను నడపనున్నట్లు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.

వివరాలు 

ఈ మార్గాల్లో అదనపు విమానాలు

న్యూయార్క్‌, లండన్‌, జపాన్‌లోని ఫ్రాంక్‌ఫర్ట్‌, ఆమ్‌స్టర్‌డామ్‌, జ్యూరిచ్‌, పారిస్‌తో పాటు కొలంబో, మాలే వంటి మార్గాల్లో ఈ అదనపు విమానాలు నడుస్తాయని ఎయిరిండియా పేర్కొంది. పశ్చిమాసియా ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ విమాన సర్వీసులపై డిమాండ్ పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ వెల్లడించింది. మరోవైపు అమెరికా-ఇజ్రాయెల్‌, ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ఇప్పటికే పలువురు భారతీయ విమానయాన సంస్థలు పశ్చిమాసియా దేశాలకు వెళ్లే తమ విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసిన విషయం తెలిసిందే.

Advertisement