LOADING...
Amazon Data Centers: డేటా సెంటర్లపై దాడులు నిజమే: అమెజాన్ 
డేటా సెంటర్లపై దాడులు నిజమే: అమెజాన్

Amazon Data Centers: డేటా సెంటర్లపై దాడులు నిజమే: అమెజాన్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 03, 2026
01:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా-ఇజ్రాయెల్ సైనిక చర్యలకు ప్రతీకారంగా పశ్చిమాసియా దేశాలపై ఇరాన్ దాడులు కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడ పనిచేస్తున్న అమెజాన్ డేటా సెంటర్లపై కూడా దాడులు జరిగాయని ఇటీవల వార్తలు వినిపించాయి. తాజాగా ఆ సమాచారం నిజమేనని అమెజాన్ వెబ్ సర్వీసెస్ అధికారికంగా ధృవీకరించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో ఉన్న తమ రెండు డేటా సెంటర్లను డ్రోన్‌ల ద్వారా లక్ష్యంగా చేసుకున్నారని అమెజాన్ వెల్లడించింది. ఈ ఘటనల కారణంగా పశ్చిమాసియాలోని కొన్ని ప్రాంతాల్లో క్లౌడ్ సేవల్లో అంతరాయం ఏర్పడినట్లు తెలిపింది. అదేవిధంగా బహ్రెయిన్‌లోని ఒక డేటా సెంటర్ సమీపంలో జరిగిన దాడితో అక్కడి మౌలిక వసతులకు కూడా నష్టం కలిగినట్లు వివరించింది.

వివరాలు 

సేవలను తిరిగి సాధారణ స్థితికి తీసుకువస్తాం 

ఈ దాడుల సమయంలో సిబ్బందికి ఎలాంటి గాయాలు అయ్యాయా అనే విషయంపై మాత్రం సంస్థ స్పష్టత ఇవ్వలేదు. సేవలను తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడానికి తమ బృందాలు స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుంటూ పని చేస్తున్నాయని తెలిపింది. అంతరాయం కారణంగా ప్రభావితమైన వినియోగదారులు తమ ముఖ్యమైన డేటాను భద్రపరచుకొని, అవసరమైతే ఇతర ప్రాంతాల్లో ఉన్న అమెజాన్ సేవలకు మారాలని సంస్థ సూచించింది.

Advertisement