LOADING...
Netanyahu: ఇరాన్‌పై దాడులు కొనసాగుతాయి.. నెతన్యాహు హెచ్చరిక
ఇరాన్‌పై దాడులు కొనసాగుతాయి.. నెతన్యాహు హెచ్చరిక

Netanyahu: ఇరాన్‌పై దాడులు కొనసాగుతాయి.. నెతన్యాహు హెచ్చరిక

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 08, 2026
01:54 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇరాన్‌పై జరుగుతున్న తీవ్ర దాడుల నేపథ్యంలో బెంజమిన్ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. ముందున్న రోజుల్లో ఇరాన్‌కు మరిన్ని సర్‌ప్రైజ్‌లు ఎదురవుతాయని ఆయన హెచ్చరించారు. ఆ దేశ ప్రజలు తమ ప్రభుత్వాన్ని పడగొట్టే సమయం చాలా దగ్గరలోనే ఉందని కూడా పేర్కొన్నారు. ఈ దాడుల ద్వారా ఇరాన్‌ను విభజించాలనే ఉద్దేశం తమకు లేదని నెతన్యాహు స్పష్టం చేశారు. అయితే అక్కడి నిరంకుశ పాలన నుంచి ప్రజలను విముక్తి చేయడమే తమ లక్ష్యమని చెప్పారు. ఇరాన్‌కు సంబంధించి తమ వ్యూహంలో తదుపరి దశకు త్వరలోనే చేరుకోబోతున్నామని కూడా వెల్లడించారు.

Details

ప్రభుత్వంలో మార్పులు తీసుకురావడం కోసం చర్యలు

ఇక ఇజ్రాయెల్ దాడుల కారణంగా ఇరాన్ ఇప్పటికే కీలక నేతలను కోల్పోయి తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటోందని నెతన్యాహు వ్యాఖ్యానించారు. ఆ దేశంలో ప్రస్తుత పాలనను అస్థిరపరచడం, ప్రభుత్వంలో మార్పులు తీసుకురావడం కోసం చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అక్కడి పాలక వర్గాన్ని గద్దె దించడానికి ఇదే సరైన సమయమని ఆయన అభిప్రాయపడ్డారు. ఇరాన్ ప్రభుత్వాన్ని అక్కడి ప్రజలే స్వయంగా కూలదోసాలని పిలుపునిచ్చారు. అలా జరిగితేనే ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య శాంతి నెలకొనే అవకాశం ఉంటుందని నెతన్యాహు పేర్కొన్నారు.

Advertisement