Petrol Hike: వాహనదారులకు షాక్.. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులు ప్రపంచ దేశాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా ఇంధన రంగంపై ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. కొన్ని రోజులుగా మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా చమురు, గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడి, అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పెరిగాయి. దీంతో అనేక దేశాల్లో ఇంధన సంక్షోభం తలెత్తి, పెట్రోల్-డీజిల్ ధరలు పెరిగిపోవడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో శ్రీలంకలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో ఏర్పడిన చమురు కొరత నేపథ్యంలో ప్రభుత్వం ధరలను పెంచినట్లు ప్రకటించింది. శనివారం అర్ధరాత్రి నుంచే కొత్త ధరలు అమల్లోకి వచ్చినట్లు శ్రీలంక ప్రభుత్వం వెల్లడించింది.
Details
ధరల పెంపు వివరాలు ఇలా ఉన్నాయి
దేశంలో కొనసాగుతున్న ఆర్థిక సంక్షోభం, అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరల పెరుగుదల వంటి కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆక్టేన్-92 పెట్రోల్ ధరను లీటర్‌కు రూ.24 పెంచడంతో అది రూ.317కు చేరింది. ఆక్టేన్-95 పెట్రోల్ ధరను లీటర్‌కు రూ.25 పెంచడంతో లీటర్ ధర రూ.365కు పెరిగింది. ఆటో డీజిల్ ధరను లీటర్‌కు రూ.22 పెంచడంతో అది రూ.303కు చేరింది. సూపర్ డీజిల్ ధరను లీటర్‌కు రూ.24 పెంచడంతో లీటర్ ధర రూ.353గా నమోదైంది. కిరోసిన్ ధరను లీటర్‌కు రూ.13 పెంచడంతో అది రూ.195కు చేరింది.
Details
తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు
ఇక పాకిస్థాన్‌లో కూడా ఇంధన ధరలు భారీగా పెరిగాయి. చమురు సంక్షోభం నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్‌కు రూ.55 చొప్పున పెంచింది. దీంతో అక్కడి ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంధన ధరల పెరుగుదలతో రవాణా ఖర్చులు పెరగడం సహా వ్యాపార రంగం, పరిశ్రమలు సామాన్య ప్రజల జీవన విధానంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం శ్రీలంక, పాకిస్థాన్ దేశాలు ఇప్పటికే ధరలు పెంచగా, ఇదే పరిస్థితి కొనసాగితే మరిన్ని దేశాలు కూడా ఇంధన ధరలను పెంచే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.