LOADING...
USA: ఇరాన్‌పై ట్రంప్ సైనిక చర్యకు అమెరికా సెనెట్ మద్దతు
ఇరాన్‌పై ట్రంప్ సైనిక చర్యకు అమెరికా సెనెట్ మద్దతు

USA: ఇరాన్‌పై ట్రంప్ సైనిక చర్యకు అమెరికా సెనెట్ మద్దతు

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 05, 2026
10:34 am

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. అమెరికా-ఇజ్రాయెల్‌,ఇరాన్‌ మధ్య తీవ్ర దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఒక కీలక పరిణామం వెలుగులోకి వచ్చింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేపట్టిన సైనిక చర్యకు ఆ దేశ సెనెట్‌లో మద్దతు లభించింది. ఇరాన్‌పై కొనసాగుతున్న సైనిక చర్య విషయంలో ట్రంప్‌కు ఉన్న అధికారాలను తగ్గించాలనే ఉద్దేశంతో సెనెట్‌లో ఒక తీర్మానం ప్రవేశపెట్టబడింది. డెమోక్రటిక్ పార్టీకి చెందిన సభ్యుడు టిమ్ కైన్ ఈ తీర్మానాన్ని ముందుకు తీసుకొచ్చారు. అయితే ఆ తీర్మానం సెనెట్‌లో ఆమోదం పొందలేదు.

వివరాలు 

తీర్మానానికి వ్యతిరేకంగా డెమోక్రటిక్ పార్టీ సభ్యుడు ఓటు

సైనిక చర్యకు మద్దతుగా మొత్తం 53 మంది సభ్యులు ఓటు వేయగా, 47 మంది మాత్రమే వ్యతిరేకంగా ఓటు వేశారు. దీంతో ఆ తీర్మానం తిరస్కరించబడింది. ఫలితంగా ఇరాన్‌పై చేపట్టిన సైనిక చర్య విషయంలో అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయానికి సెనెట్‌లో మద్దతు లభించినట్టైంది. ఈ ఓటింగ్ సందర్భంగా రిపబ్లికన్ పార్టీకి చెందిన సభ్యుడు రాండ్ పాల్ తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు. అదే సమయంలో డెమోక్రటిక్ పార్టీకి చెందిన సభ్యుడు జాన్ ఫెట్టర్‌మాన్ మాత్రం తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేశారు.

Advertisement