LOADING...
Airline ticket prices increase: ఇరాన్‌ - ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావం.. భారీగా పెరిగిన విమాన టికెట్ ధరలు
ఇరాన్‌ - ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావం.. భారీగా పెరిగిన విమాన టికెట్ ధరలు

Airline ticket prices increase: ఇరాన్‌ - ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావం.. భారీగా పెరిగిన విమాన టికెట్ ధరలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 03, 2026
05:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇరాన్‌-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా భారత విమానయాన రంగం తీవ్ర ప్రభావానికి లోనైంది. భారతనుండి ఇతర దేశాల వైపు వెళ్లే అనేక విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఈ రోజు (మంగళవారం) బెంగళూరు కెంపెగౌడ ఇంటర్‌నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు సంబంధించిన 42 విమాన సర్వీసులు రద్దు అయ్యాయి. అదే సమయంలో దిల్లీ ఎయిర్‌పోర్ట్కు ‌‌ చెందిన 80 సర్వీసులు నిలిచిపోయాయి. కోల్‌కతా నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించిన 10 విమాన సర్వీసులు రద్దయ్యాయి. రద్దైన సర్వీసులలో యూఏఈకు వెళ్లే విమానాలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి.

Details

ఆకాశానికి టికెట్ ధరలు  

యుద్ధ పరిస్థితులను అనుకూలంగా ఉపయోగించుకుని పలు విమానయాన సంస్థలు టికెట్ ధరలను భారీగా పెంచుతున్నాయి. హైదరాబాద్ నుంచి లండన్, ఫ్రాంక్‌ఫర్ట్‌కి వెళ్లే విమానాల టికెట్ ధరలు సాధారణ కంటే రెట్టింపు అయ్యాయి. మంగళవారం హైదరాబాద్ నుంచి లండన్ వెళ్లే విమాన టికెట్ ధరలు 65 వేల రూపాయల నుంచి 90 వేల రూపాయల వరకు ఉన్నాయి. జర్మనీలోకి వెళ్లే విమానాల టికెట్ ధరలు 200%-300% పెరిగాయని ట్రావెల్ ఏజెంట్లు చెబుతున్నారు. అమెరికా మార్గంలో కూడా పరిస్థితి ఇదే.

Details

పలు విమాన సర్వీసులు రద్దు

హైదరాబాద్ నుంచి ఇథియోపియా ద్వారా న్యూయార్క్ వెళ్లే విమాన టికెట్ ధర 1.5 లక్షల రూపాయలుగా ఉంది. కావున హైదరాబాద్ నుంచి యూఏఈకు పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. కేవలం సోమవారం ఒక్కరోజే 50 విమాన సర్వీసులు నిలిచిపోయాయి. ప్రతీ రోజు సుమారుగా 5 వేల మంది ప్రయాణికులు యూఏఈ వెళ్తారని వెల్లడైంది. విమాన సర్వీసుల రద్దు కారణంగా ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Advertisement