Iran-Israel war : ఇరాన్ తీరుపై జర్మనీ, బ్రిటన్, ఫ్రాన్స్ సీరియస్ .. అమెరికా, ఇజ్రాయెల్‌కు మద్దతుగా యుద్ధ రంగంలోకి
ఈ వార్తాకథనం ఏంటి
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధ ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. United States, Israel కలిసి ఇరాన్‌పై వరుస క్షిపణి దాడులు జరిపినట్లు సమాచారం. ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీం నాయకుడు Ali Khameneiతో పాటు ఆయన కుటుంబ సభ్యుల్లో కొందరు ప్రాణాలు కోల్పోయినట్లు వార్తలు వెలువడ్డాయి. దీనికి ప్రతిస్పందనగా ఇరాన్ ప్రతీకార చర్యలకు దిగింది. ఇజ్రాయెల్‌తో పాటు గల్ఫ్ ప్రాంత దేశాలపై కూడా బాంబులు, క్షిపణులతో దాడులు చేపడుతోంది. ఈ పరిణామాలతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళనాత్మక వాతావరణం నెలకొంది.
వివరాలు
ఇరాన్ ప్రజలు స్వేచ్ఛ సాధించాలంటూ ట్రంప్ పిలుపు
ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులు సుమారు నాలుగు వారాల పాటు కొనసాగవచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఇదే సమయంలో ఇరాన్‌కు చెందిన ఐఆర్‌జీసీ, సైనిక దళాలకు ఆయన ఒక ప్రతిపాదన కూడా చేశారు. ఆయుధాలు సమర్పిస్తే ప్రాణహాని ఉండదని, లొంగకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. ప్రస్తుత పరిస్థితులను ఉపయోగించుకుని ఇరాన్ ప్రజలు స్వేచ్ఛ సాధించాలంటూ ట్రంప్ పిలుపునిచ్చారు.
వివరాలు
అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగే అవకాశం
ఇక పశ్చిమాసియా మొత్తం యుద్ధ ప్రభావంతో కలవరపడుతోంది. ఇరాన్ గల్ఫ్ దేశాలపై దాడులు ప్రారంభించడంతో United Arab Emirates టెహ్రాన్‌లోని తన దౌత్య కార్యాలయాన్ని మూసివేసింది. ఆదివారం Strait of Hormuz గుండా ప్రయాణిస్తున్న చమురు ట్యాంకర్లపై ఇరాన్ దాడులు జరిపింది. హార్మోజ్ జలసంధి మూసివేతకు దారితీసే పరిస్థితి నెలకొంటే అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగే అవకాశముంది. గల్ఫ్ దేశాల ఆర్థిక వనరులను దెబ్బతీయాలన్న ఉద్దేశంతో ఇరాన్ చర్యలు చేపడుతున్నట్లు అంచనాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో Saudi Arabiaలోని అతిపెద్ద చమురు శుద్ధి కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ డ్రోన్ దాడులు జరిపింది. ఈ దాడులతో భారీ స్థాయిలో నష్టం సంభవించగా,రోజుకు సుమారు 5.5లక్షల బ్యారెళ్ల చమురు ఉత్పత్తి నిలిచిపోయినట్లు సమాచారం.
వివరాలు
అమెరికా చర్చలకు సిద్ధం.. ఖండించిన ఇరాన్
ఇదిలా ఉండగా, అమెరికా చర్చలకు సిద్ధమైందన్న వార్తలు వెలువడ్డాయి. అయితే వాటిని ఇరాన్ ఖండించింది. అమెరికాతో ఎలాంటి చర్చలు జరపబోమని ఇరాన్ విదేశాంగ మంత్రి స్పష్టం చేశారు. అలాగే ఇరాన్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి Ali Larijani కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. దౌత్య వ్యవహారాల్లో అమెరికా నమ్మదగిన రికార్డు లేదని ఆయన విమర్శించారు.
వివరాలు
యుద్ధంలోకి మరో మూడు దేశాలు..!
ఇరాన్ దాడులను United Kingdom, France, Germany దేశాలు తీవ్రంగా ఖండించాయి. ముఖ్యంగా గల్ఫ్ దేశాలపై జరిగిన క్షిపణి దాడులను అవి తీవ్రంగా వ్యతిరేకించాయి. మిత్ర దేశాలకు పూర్తి మద్దతు ఉంటుందని, ఇరాన్ క్షిపణి లాంచర్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకునేందుకు బ్రిటన్ సైనిక స్థావరాలను అమెరికా వినియోగించుకోవచ్చని యూకే ప్రధాని Keir Starmer పేర్కొన్నారు. ఇప్పటికే ఇరాన్ నుంచి ప్రయోగించే డ్రోన్లు, క్షిపణులను గాల్లోనే అడ్డుకునేందుకు ఈ దేశాలు రక్షణ సహకారం అందిస్తున్నాయి.
వివరాలు
ప్రపంచ యుద్ధానికి దారి తీసే అవకాశాలపై కూడా చర్చలు
ఇక ఇరాన్ దాడుల ప్రభావంతో జోర్డాన్లోని జర్మనీ సైనిక శిబిరం సమీపంలో పేలుళ్లు సంభవించాయి. పరిస్థితులు ఎంత ఉద్రిక్తంగా ఉన్నాయో దీనితో స్పష్టమవుతోంది. అమెరికాకు తోడుగా యూరోపియన్ దేశాలు కూడా చురుకుగా వ్యవహరించడం వల్ల ఈ సంక్షోభం ప్రాంతీయ స్థాయిని దాటి ప్రపంచవ్యాప్త ప్రభావం చూపే ప్రమాదం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అదే పరిస్థితి కొనసాగితే ప్రపంచ యుద్ధానికి దారి తీసే అవకాశాలపై కూడా చర్చలు మొదలయ్యాయి.