ఇండోనేషియా: వార్తలు

25 Apr 2023

భూకంపం

ఇండోనేషియాలో 7.3 తీవ్రతతో భారీ భూకంపం; సునామీ హెచ్చరికలు 

ఇండోనేషియాలో మంగళవారం భారీ భూకంపం సంభవించింది. సుమత్రా ద్వీపానికి పశ్చిమాన 7.3తీవ్రతతో భారీ ప్రకంపనలు వచ్చినట్లు ఇండోనేషియా జియోఫిజిక్స్ ఏజెన్సీ (బీఎంకేజీ) తెలిపింది.

కలుషిత మందులపై తక్షణమే చర్యలు తీసుకోండి: డబ్ల్యూహెచ్ఓ

కలుషిత మందులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రపంచ దేశాలకు సూచించింది. 2022లో కలుషితమైన దగ్గు సిరప్‌లు తాగి అనేక మంది చిన్నారులు మృతి చెందిన నేపథ్యంలో డబ్ల్యూహెచ్ఓ ఈ హెచ్చరిక జారీ చేసింది.

ఇండోనేషియాలో భారీ భూకంపం, రిక్టర్ స్కేలుపై 6.0 తీవ్రత నమోదు

ఇండోనేషియాలో సోమవారం ఉదయం భారీ భూకంపం నమోదైంది. రిక్టర్ స్కేలుపై 6.0 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే పేర్కొంది. ప్రస్తుతం అయితే ప్రాణ నష్టానికి సంబంధించిన ఎలాంటి సమాచారం అందలేదని వెల్లడించింది.