
Indonesia : ఇండోనేషియాలో భారీ భూకంపం.. సౌలంకిలో అలజడులు, స్థానికులు ఏమన్నారో తెలుసా
ఈ వార్తాకథనం ఏంటి
ఇండోనేషియాలో భూకంపం సంభవించింది. ఈ మేరకు సౌలంకి సిటీలో ఒక్కసారిగా భూమి కంపించింది. దీంతో దేశంలో అలజడి రేగింది.
రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.9గా నమోదైనట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే రిపోర్ట్ వెల్లడించింది.
ఇవాళ ఉదయం 10.23 గంటలకు బండా సముద్రంలో ప్రకంపనలు నమోదైనట్లు జాతీయ భూకంప కేంద్రం(Center for Seismology) వివరించింది.
భూకంపం కారణంగా ఎంత మంది చనిపోయారు, ఎంత మందికి గాయపడ్డారన్న వివరాలు తెలియరాలేదు.
ఈ భూ ప్రకంపనల నేపథ్యంలో అమెరికా జియోలాజికల్ సర్వే(USGS) సునామీ హెచ్చరికలు మాత్రం చేయకపోవడం గమనార్హం.
ఇండోనేషియాలోని అంబాన్‌కి ఆగ్నేయ దిశలో 370 కిలోమీటర్ల మేర ఈ ప్రభావం కనిపించింది. 146 కిలోమీటర్ల లోతు వరకూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి.
DETAILS
ఇండోనేషియాలో భూకంపాలు సర్వ సాధారణమైపోయాయి : స్థానికులు
భూకంప తీవ్రత ఎక్కువగా ఉండటంతో సౌలంకి పరిసర ప్రాంతాల్లో దీని ప్రభావం ఎక్కువగా కనిపించింది.
మరోవైపు ఇలాంటి పరిస్థితుల్లోనూ తాము ధైర్యంగానే ఉన్నామని, ఇండోనేషియాలో భూకంపాలు సర్వ సాధారణమైపోయాయని స్థానికులు అంటున్నారు.
సునామీ హెచ్చరికలు సైతం ఏమీ లేకపోవడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నామని, ప్రస్తుతానికి ఎలాంటి ఇబ్బంది లేదన్నారు.
ఇండోనేషియాలో భూకంపాలు చాలా సాధారణమని, ఫలితంగా దీన్ని పెసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అని పిలుస్తారు.
జపాన్ భౌగోళిక పరిస్థితులు ఇండోనేషియాపై ప్రభావం చూపిస్తుంటాయి. ఈ కారణంగానే ఇక్కడ తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి.
గతేడాది నవంబర్‌లో వెస్ట్ జావా ప్రావిన్స్‌లో రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 5.6గా నమోదైంది. ఆ సమయంలో భూకంప ధాటికి 602 మంది ప్రాణాలు కోల్పోయారు.