LOADING...
Vijay - Rashmika : విజయ్-రష్మిక వెడ్డింగ్ వీడియో కోసం ఓటీటీ బంపర్ ఆఫర్!
విజయ్-రష్మిక వెడ్డింగ్ వీడియో కోసం ఓటీటీ బంపర్ ఆఫర్!

Vijay - Rashmika : విజయ్-రష్మిక వెడ్డింగ్ వీడియో కోసం ఓటీటీ బంపర్ ఆఫర్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 13, 2026
09:15 am

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్‌లో మోస్ట్ క్రేజీ కపుల్‌గా గుర్తింపు పొందిన విజయ్ దేవరకొండ - రష్మిక మందన్నల పెళ్లి వార్తలు కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఇప్పటివరకు ఈ జంట నుంచి అధికారిక ప్రకటన వెలువడకపోయినా, ఈ నెల 26న వీరి వివాహం జరగబోతుందన్న ప్రచారం ఊపందుకుంది. ఇదిలాఉంటే, వీరి పెళ్లి వేడుకకు సంబంధించి మరో సంచలన వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ ఫ్లిక్స్ ఈ వివాహ వేడుకకు సంబంధించిన వీడియో హక్కుల కోసం ఏకంగా రూ.60 కోట్లు ఆఫర్ చేసినట్లు సమాచారం. గతంలో నయనతార, విగ్నాణ్ శివన్ వివాహానికి సంబంధించిన డాక్యుమెంటరీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సుమారు రూ.25 కోట్లకు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

Details

ఈ ఆఫర్ ను తిరస్కరించిన విజయ్ దేవరకొండ

ఆ డీల్‌ను మించి, దాదాపు రెట్టింపు కంటే ఎక్కువ మొత్తాన్ని విజయ్-రష్మిక జంటకు ఆఫర్ చేయడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ భారీ ఆఫర్‌ను విజయ్ దేవరకొండ సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. తన జీవితంలోని అత్యంత ముఖ్యమైన, మధురమైన క్షణాలను వ్యాపార కోణంలో చూడటం తనకు ఇష్టం లేదని, పెళ్లి జ్ఞాపకాలు కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ప్రైవేట్‌గా ఉండాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే నెట్‌ఫ్లిక్స్ ఇచ్చిన ఈ 'మెగా ఆఫర్'కు విజయ్ 'బిగ్ నో' చెప్పినట్టుగా ప్రచారం జరుగుతోంది. అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడకపోయినా, ఈ భారీ డీల్ ఆఫర్ వార్త ఈ జంటకు ఉన్న క్రేజ్‌ను మరోసారి స్పష్టం చేస్తోంది.

Advertisement