Loading...
Yashasvi Jaiswal: ఆర్ఆర్‌కు జైస్వాల్‌ గుడ్‌బై...కారణం ఇదే
ఆర్ఆర్‌కు జైస్వాల్‌ గుడ్‌బై...కారణం ఇదే

Yashasvi Jaiswal: ఆర్ఆర్‌కు జైస్వాల్‌ గుడ్‌బై...కారణం ఇదే

వ్రాసిన వారు Balachander Sharma
Nov 20, 2026
11:39 am

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్‌ 2027 సీజన్‌కు ముందే రాజస్థాన్‌ రాయల్స్‌లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఫ్రాంచైజీ రిటైన్‌ చేసుకున్నప్పటికీ స్టార్‌ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ జట్టును వీడాలని భావిస్తున్నట్లు సమాచారం. తన నిర్ణయాన్ని రాజస్థాన్‌ యాజమాన్యానికి ఇప్పటికే తెలియజేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే అతడిని మరో జట్టుకు పంపేందుకు గత రెండు నెలలుగా జరిగిన ట్రేడ్‌ చర్చలు ఇప్పటివరకు ఫలించలేదు. నవంబర్‌ 17న ప్రకటించిన రిటెన్షన్‌ జాబితాలో జైస్వాల్‌ పేరు ఉన్నా.. అతడి భవిష్యత్తుపై ఇప్పుడు ఆసక్తికర చర్చ మొదలైంది.

Details

లక్నో, ఢిల్లీ చర్చలు ఎందుకు ఆగిపోయాయి?

జైస్వాల్‌ కోసం లక్నో సూపర్‌ జెయింట్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ సహా పలు జట్లు ఆసక్తి చూపినట్లు సమాచారం.

లక్నోతో చర్చలు చివరి దశకు వెళ్లినా.. జైస్వాల్‌కు బదులుగా రాజస్థాన్‌ కోరిన ఇద్దరు ఆటగాళ్లను ఇచ్చేందుకు ఆ ఫ్రాంచైజీ అంగీకరించలేదు.

ఢిల్లీ క్యాపిటల్స్‌ కూడా కేఎల్‌ రాహుల్‌కు జోడీగా ఓపెనర్‌ కోసం సంప్రదించినట్లు తెలుస్తోంది.

అయితే ఢిల్లీ నుంచి వచ్చిన ప్రతిపాదనపై రాజస్థాన్‌ సంతృప్తి చెందలేదని సమాచారం.

ముంబై ఇండియన్స్‌ కూడా ఆసక్తి చూపగా, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ఇంకా రేసులో ఉన్నట్లు టాక్‌ వినిపిస్తోంది.

Details

జైస్వాల్‌ అసంతృప్తికి కారణాలేంటి?

జైస్వాల్‌ నిర్ణయం వెనుక కొన్ని కారణాలు ఉన్నట్లు క్రికెట్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సంజూ శాంసన్‌ నిష్క్రమణ తర్వాత కెప్టెన్సీ బాధ్యతలు రియాన్‌ పరాగ్‌కు దక్కడం ఒక కారణంగా చెబుతున్నారు.

అలాగే ఐపీఎల్‌ 2026లో యువ ఆటగాడు వైభవ్‌ సూర్యవంశీకి లభించిన ప్రాధాన్యం కూడా జైస్వాల్‌ను అసంతృప్తికి గురిచేసిందనే కథనాలు వస్తున్నాయి.

మరోవైపు భారత టీ20 జట్టులోనూ తన స్థానాన్ని కోల్పోవడం పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చింది. అయితే వీటిపై జైస్వాల్‌ నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు.

ADVERTISEMENT

Details

ఏడేళ్ల అనుబంధానికి బ్రేక్‌ పడుతుందా?

జైస్వాల్‌ గత ఏడేళ్లుగా రాజస్థాన్‌ రాయల్స్‌తోనే కొనసాగుతున్నాడు. గత నాలుగు ఐపీఎల్‌ సీజన్లలోనూ 400కు పైగా పరుగులు సాధిస్తూ జట్టులో కీలక బ్యాటర్‌గా నిలిచాడు.

ఇలాంటి ఆటగాడిని వదులుకోవడం రాజస్థాన్‌కు కూడా సాధారణ నిర్ణయం కాదు. ప్రస్తుతం ట్రేడింగ్‌ విండో డిసెంబర్‌ 9 వరకు కొనసాగనుంది.

దీంతో చివరి వరకు చర్చలకు అవకాశం ఉంది. ఇప్పటికే శామ్‌ కరన్‌ను లక్నోకు పంపిన రాజస్థాన్‌.. మహమ్మద్‌ షమీ, మణిమారన్‌ సిద్ధార్థ్‌లను జట్టులోకి తీసుకుంది.

జైస్వాల్‌ చివరకు ఏ జట్టులో ఉంటాడనేది ఇప్పుడు ఐపీఎల్‌ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.

ADVERTISEMENT