Page Loader
India-Indonesia: రక్షణ ఉత్పత్తుల తయారీలో భారత్‌, ఇండోనేషియా సహకారం
రక్షణ ఉత్పత్తుల తయారీలో భారత్‌, ఇండోనేషియా సహకారం

India-Indonesia: రక్షణ ఉత్పత్తుల తయారీలో భారత్‌, ఇండోనేషియా సహకారం

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 25, 2025
04:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌, ఇండోనేషియా తమ ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి సంయుక్తంగా నిర్ణయం తీసుకున్నాయి. రక్షణ ఉత్పత్తుల తయారీ, వాణిజ్య రంగాల్లో పరస్పర ప్రయోజనాలను అందుకునే దిశగా కలిసి ముందుకు సాగేందుకు ఇరుదేశాలు అంగీకరించాయి. ఈ ఒప్పందం ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య జరిగిన సమావేశంలో కుదిరింది. ప్రస్తుతం సుబియాంతో మూడు రోజుల భారత్‌ పర్యటనలో ఉన్నారు. ఆదివారం దిల్లీలోని కర్తవ్య పథ్‌లో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. శనివారం జరిగిన సమావేశం అనంతరం ఇరుదేశాల నేతలు మీడియాతో మాట్లాడారు.

Details

ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలు

ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, ఇండోనేషియా భారత్‌కు కీలక భాగస్వామి అని తెలిపారు. ఆసియాన్‌ కూటమి 10 దేశాలపాటు ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో ఇండోనేషియాకు భారత్‌ ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. అంతర్జాతీయ చట్టాల ప్రకారం పరస్పర సంబంధాలను కొనసాగించేందుకు ఇరుదేశాలు ఒకే అభిప్రాయానికి వచ్చినట్లు ప్రకటించారు. రక్షణ ఉత్పత్తుల తయారీ రంగంలో భారత్‌, ఇండోనేషియా సంయుక్తంగా పనిచేయనున్నట్లు మోదీ వెల్లడించారు. ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో చైనా నౌకల పెరుగుతున్న సంచారం నేపథ్యంలో సముద్ర రక్షణను బలోపేతం చేయడానికి ఇరుదేశాల మధ్య కీలక ఒప్పందం కుదిరింది.

Details

ఫిన్‌టెక్‌, కృత్రిమ మేధ, ఐవోటీ రంగాల్లో భాగస్వామ్యం

కృత్రిమ మేధ, ఇంటర్నెట్‌, డిజిటల్‌ మౌలిక సదుపాయాల అభివృద్ధిపై పరస్పర సహకారానికి ఇరుదేశాలు సిద్ధమయ్యాయి. ద్వైపాక్షిక సంబంధాలను మరింత మెరుగుపరచడానికి ఇండోనేషియా కూడా ఆసక్తి చూపుతోందని అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో స్పష్టం చేశారు. ఫిన్‌టెక్‌, ఏఐ, ఐవోటీ, డిజిటల్‌ పబ్లిక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ వంటి రంగాల్లో సహకారాన్ని పెంపొందించేందుకు ఇరుదేశాలు నిర్ణయం తీసుకున్నాయని ఆయన పేర్కొన్నారు.