LOADING...
Grok AI: 'ఎక్స్' గ్రోక్‌ చాట్‌బాట్‌ దుర్వినియోగంపై దిద్దుబాటు చర్యలు 
'ఎక్స్' గ్రోక్‌ చాట్‌బాట్‌ దుర్వినియోగంపై దిద్దుబాటు చర్యలు

Grok AI: 'ఎక్స్' గ్రోక్‌ చాట్‌బాట్‌ దుర్వినియోగంపై దిద్దుబాటు చర్యలు 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 15, 2026
10:35 am

ఈ వార్తాకథనం ఏంటి

'ఎక్స్‌' సామాజిక మాధ్యమంలోని 'గ్రోక్' అనే ఏఐ చాట్‌బాట్‌ను దుర్వినియోగం చేస్తూ, కొందరు వ్యక్తులు అసభ్యమైన, అశ్లీల కంటెంట్‌ను సృష్టిస్తున్నారని తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితిని గమనించిన ఇండోనేషియా వంటి కొన్ని దేశాలు 'గ్రోక్'పై తాత్కాలిక నిషేధం కూడా విధించాయి. ఈ నేపథ్యంలో, 'ఎక్స్' సంస్థ మరింత కఠినంగా దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఈ చాట్‌బాట్ సహాయంతో వ్యక్తుల ఫోటోలు ఇబ్బందికరంగా మార్పు చెందకుండా నిరోధించే విధంగా సాంకేతిక నియంత్రణలు అమలు చేశామని వెల్లడించింది.

వివరాలు 

 3,500 పోస్టులను బ్లాక్ చేసి, 600 ఖాతాలను డిలీట్ చేసిన ఎక్స్ 

'చట్టవిరుద్ధంగా పరిగణించే దేశాల పరిధిలో బికినీలు లేదా లోదుస్తులు ధరించినట్లుగా ఫోటోలను మార్చే అవకాశాలను బ్లాక్ చేస్తాం.నిజమైన వ్యక్తుల చిత్రాలను 'గ్రోక్' ద్వారా ఈ విధంగా ఎడిట్ చేయకుండా నిరోధించే అవసరమైన సాంకేతిక చర్యలు తీసుకున్నాం.ఈ నియమాలు పెయిడ్ సబ్‌స్క్రైబర్స్‌కి మాత్రమే కాక,అందరికీ వర్తిస్తాయి' అని 'ఎక్స్' భద్రతా బృందం ఒక ప్రకటనలో తెలిపింది. భారతదేశంలో కూడా 'గ్రోక్' వ్యవహారంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.ఈ నేపథ్యంలో,కేంద్ర ప్రభుత్వం అలాంటి పోస్టులను తొలగించాలని ఇటీవల ఆదేశించింది. ఆ ఆదేశాన్ని అనుసరించి 'ఎక్స్' 3,500 పోస్టులను బ్లాక్ చేసి, 600 ఖాతాలను డిలీట్ చేసింది. కేంద్ర ప్రభుత్వ వర్గాల ప్రకారం,'ఎక్స్' తన వేదికపై అసభ్యతకు స్థలం ఇవ్వదని, ప్రభుత్వ నిబంధనలను పూర్తిగా పాటిస్తుందని హామీ ఇచ్చింది.

Advertisement