Indonesia -Java-Earth Quake: ఇండోనేషియాలోని జావా ద్వీపంలో భారీ భూకంపం...రిక్టార్ స్కేల్ పై 6.1 గానమోదు
ఇండోనేషియా (Indonesia)లోని జావా (Java) ద్వీపంలోని దక్షిణ భాగంలో ఏప్రిల్ 27న 6.1 తీవ్రతతో భూకంపం (Earth Quake) సంభవించింది. బంజార్ నగరానికి దక్షిణంగా 102 కిలోమీటర్లు (63 మైళ్ళు) 68.3 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే (US Geological Survey) వెల్లడించింది. అయితే, సునామీ (Tsunami) హెచ్చరిక లు జారీ చేయలేదని ఇప్పటివరకు ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం గురించి సమాచారం అందలేదని తెలిపింది. పశ్చిమ జావా ప్రావిన్షియల్ రాజధాని బాండుంగ్‌లో, జకార్తా పక్కనే ఉన్న డెపోక్, టాంగెరాంగ్, బోగోర్ , బెకాసి, జకార్తా ప్రాంతాల్లో ఎత్తైన భవనాలు ఒక నిమిషం పాటు ఊగిసలాడాయి.
ఇక్కడ భూకంపాలు సాధారణమే...
పశ్చిమ జావా, యోగ్యకర్త,తూర్పు జావా ప్రావిన్స్ లోని ఇతర నగరాల్లో కూడా భూకంపం సంభవించినట్లు ఇండోనేషియా వాతావరణ, క్లైమాటాలజీ విభాగం, జియోఫిజికల్ ఏజెన్సీ సంస్థలు వెల్లడించాయి. సాధారణంగా దేశమంతటా తరచుగా భూప్రకంపాలు వస్తుంటాయి, అయితే జకార్తాలో చాలా అరుదు. పశ్చిమ జావాలోని సియాంజూర్ నగరంలో 2022లో 5.6 తీవ్రతతో సంభవించిన భూకంపమే తీవ్రమైనదిగా పరిగణిస్తున్నారు. సులవేసిలో 2018 లో 4,300 మంది మరణించిన సునామీ ఘటన తర్వాత ఇండోనేషియాలో ఇదే అత్యంత తీవ్రమైనది భూకంపంగా పరిగణిస్తున్నారు.