భూకంపం: వార్తలు

19 Mar 2023

నష్టం

ఈక్వెడార్‌లో 6.8 తీవ్రతతో భూకంపం, 14 మంది మరణం

శనివారం ఈక్వెడార్, ఉత్తర పెరూ తీరప్రాంతాన్ని కుదిపేసిన భారీ భూకంపంలో కనీసం 14 మంది చనిపోయారు. యుఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం (USGS) 6.8 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపం గుయాస్ ప్రావిన్స్‌లోని బాలావో నగరానికి 10 కిమీ (6.2 మైళ్లు) దూరంలో 66.4 కిమీ (41.3 మైళ్లు) దగ్గర సంభవించింది.

23 Feb 2023

చైనా

వరుస భూకంపాలతో అల్లాడిపోయిన తజికిస్థాన్‌; విరిగిపడ్డ కొండచరియలు

వరుస భూకంపాలతో తజకిస్థాన్ వణికిపోయింది. తూర్పు తజికిస్థాన్‌లో 6.8, 5.0, 4.6 తీవ్రతలతో వెంట వెంటనే భూమి కంపించడంతో ప్రజలు అల్లాడిపోయారు.

22 Feb 2023

నేపాల్

నేపాల్‌లో 5.2 తీవ్రతతో భూకంపం; కూలిన భవనాలు

నేపాల్ లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.2 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేపాల్‌లోని నేషనల్‌ ఎర్త్‌క్వేక్‌ మానిటరింగ్‌ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌(ఎన్ఈఎంఆర్‌సీ) పేర్కొంది. బజురా జిల్లాలోని బిచియా చుట్టూ భూమి కంపించినట్లు వెల్లడించింది.

భవిష్యత్‌లో భారత్‌కు భారీ భూకంపాల ముప్పు ; నిపుణుల హెచ్చరిక

ప్రతి సంవత్సరం భారత భూభాగం సుమారు 5 సెం.మీ వరకు స్థాన భ్రంశం అవుతున్నట్లు హైదరాబాద్‌లోని నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఎన్‌జీఆర్‌ఐ) ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పూర్ణచంద్రరావు వెల్లడించారు. ఈ ప్రభావం హిమాలయ ప్రాంతాలపై ఎక్కువగా ఉంటుందని చెప్పారు. ఫలితంగా రాబోయే రోజుల్లో భూకంపాలు భారీగా పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు.

21 Feb 2023

టర్కీ

టర్కీలో మరోసారి వరసుగా రెండు భూకంపాలు; అదనపు సాయానికి ముందుకొచ్చిన ఐక్యరాజ్య సమితి

టర్కీలోని దక్షిణ హటే ప్రావిన్స్‌లో రెండు భారీ భూకంపాలు సంభవించాయి. ఈ భూకంపాల ధాటికి ముగ్గురు మృతి చెందగా, 213 మంది గాయపడినట్లు టర్కీ అంతర్గత మంత్రి సులేమాన్ వెల్లడించారు. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయని సులేమాన్ తెలిపారు.

18 Feb 2023

సిరియా

భూకంపం: 11రోజులుగా శిథిలాల కింద సజీవంగా ముగ్గురు; టర్కీ, సిరియాలో 45,000 దాటిన మరణాలు

టర్కీ, సిరియాలో 11రోజలు కింద సంభవించిన భారీ భుకంపాల ధాటికి ఇప్పటి వరకు 45,000 మందికి పైగా మరణించారు. 40కిపైగా వచ్చిన ప్రకంపనల వల్ల వేలాది భవనాలను నేలమట్టం అయ్యాయి. దాదాపు 2,64,000 అపార్ట్‌మెంట్లు పోయాయి. గడ్డకట్టే చలిలోనూ రెస్క్యూ బృందాలు సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి.

జమ్మూ కాశ్మీర్‌లోని కత్రాలో తెల్లవారుజామున భూకంపం

జమ్మూకాశ్మీర్‌లోని కత్రాలో తెల్లవారుజామున భూకంపం సంభవించింది. కత్రాకు తూర్పున 97 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం చోటు చేసుకుంది. రిక్టర్ స్కేల్‌పై భూకంపం తీవ్రత 3.6గా నమోదైందని నేషనల్ సిస్మోలాజికల్ సెంటర్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఉదయం 5.01 గంటలకు 10 కి.మీ లోతులో భూకంపం వచ్చినట్లు తెలుస్తోంది.

సెంట్రల్ ఫిలిప్పీన్స్‌లో భూకంపం; రిక్టర్ స్కేలుపై 6.1తీవ్రత నమోదు

ఫిలిప్పీన్స్‌లో గురువారం భూకంపం సంభవించింది. సెంట్రల్ ఫిలిప్పీన్స్‌లో మాస్బేట్ ప్రాంతంలో భారీ ప్రకంపనలు రావడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీశారు.

న్యూజిలాండ్ తీరంలో భారీ భూకంపం; రిక్టర్ స్కేలుపై 6.1తీవ్రత నమోదు

సైక్లోన్ సృష్టించిన విధ్వంసం నుంచి తేరుకోకముందే న్యూజిలాండ్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.1తీవ్రత నమోదైనట్లు యూరోపియన్-మెడిటరేనియన్ సిస్మోలాజికల్ సెంటర్ ధృవీకరించింది. ఈ భూకంపం వెల్లింగ్‌టన్ సమీపంలోని లోయర్ హట్‌కు వాయువ్యంగా 78 కి.మీ దూరంలో సంభవంచినట్లు వెల్లడించింది.

13 Feb 2023

టర్కీ

టర్కీలో 4.7 తీవ్రతతో మరో భూకంపం, 34,000 దాటిన మృతుల సంఖ్య

టర్కీలో ఆదివారం మరో భూకంపం సంభవించింది. టర్కీ, సిరియాలో సరిహద్దులో రిక్టర్ స్కేలుపై 7.8 తీవ్రతతో భయంకరమైన భూకంపం వచ్చిన వారం తర్వాత ఇది సంభవించింది.

13 Feb 2023

సిక్కిం

సిక్కింలో భూకంపం, యుక్సోమ్‌లో 4.3 తీవ్రత నమోదు

సిక్కింలో సోమవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. సిక్కింలోని యుక్సోమ్ పట్టణంలో రిక్టర్ స్కేలుపై 4.3 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలియజేసింది.

అఫ్గానిస్థాన్‌లో భూకంపం, రిక్టర్ స్కేలుపై 4.3 తీవ్రత

అఫ్గానిస్థాన్‌లో భూకంపం సంభవించింది. అఫ్గాన్‌లోని ఫైజాబాద్‌లో రిక్టర్ స్కేలుపై 4.3 తీవ్రతతో ప్రకంపనలు సంభవించినట్లు అధికారులు చెప్పారు.

11 Feb 2023

టర్కీ

టర్కీలో 8ఏళ్ల బాలికను కాపాడిన ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది, 24వేలు దాటిన మృతులు

నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్టీఆర్‌ఎఫ్) శుక్రవారం టర్కీ ఆర్మీ సమన్వయంతో మరొక బాలికను కాపాడింది. శిథిలాల కింద చిక్కుకున్న 8ఏళ్ల బాలికను సిబ్బంది రక్షించారు.

టర్కీ లో ఆరేళ్ళ బాలికను రక్షించిన స్నిపర్ డాగ్స్ రోమియో,జూలీ

టర్కీలో వరుసగా సంభవించిన భూకంపాల తర్వాత మూడు రోజులపాటు శిథిలాల కింద కూరుకుపోయిన 6 ఏళ్ల బాలికను స్నిఫర్ డాగ్స్ రక్షించాయి. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ డాగ్ స్క్వాడ్‌లో భాగమైన రోమియో, జూలీ, శిథిలాల కింద 6 ఏళ్ల నస్రీన్ ఆచూకీని గుర్తించడంలో కీలక పాత్ర పోషించాయి.

10 Feb 2023

ప్రపంచం

పేరుతో పాటు కొత్త కుటుంబంలో భాగమైన సిరియా భూకంప శిథిలాలలో జన్మించిన శిశువు

సిరియాలో సోమవారం సంభవించిన భూకంపం తర్వాత జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్ లో ఒక ఇంటి శిథిలాల కింద దొరికిన అప్పుడే పుట్టిన పసికందుకు పేరుతో పాటు ఒక ఇల్లు దొరికింది..

10 Feb 2023

ప్రపంచం

టర్కిలో 21,000 చేరుకున్న మరణాలు అహర్నిశలు శ్రమిస్తున్న రెస్క్యూ టీమ్‌లు

సోమవారం భారీ భూకంపం కారణంగా సిరియా, టర్కీలో 21,000 మందికి పైగా మరణించారు. విరామం లేకుండా 24 గంటలూ రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి కానీ మంచు, వర్షం కారణంగా వారి పనికి ఆటంకం కలుగుతుంది.

09 Feb 2023

టర్కీ

టర్కీ, సిరియాలో మరణ మృదంగం: 15,000 దాటిన భూకంప మరణాలు

టర్కీ, సిరియాలో భూకంపం మరణ మృదంగాన్ని మోగిస్తోంది. గత 24గంటల్లో శిథిలాల కింద చిక్కుకున్న 7వేలకుపైగా మృతదేహాలను రెస్క్యూ సిబ్బంది వెలికి తీశారు. దీంతో రెండు దేశాల్లో మృతుల సంఖ్య 15,383కు చేరుకున్నట్లు టర్కీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది.