LOADING...
#Newsbytes Explaner:మయన్మార్‌ భూగర్భ రహస్యాలు.. సగాయింగ్‌ ఫాల్ట్‌ ఎందుకు ప్రమాదకరం..గతంలో సంభవించిన ప్రమాదాలివే!
మయన్మార్‌ భూగర్భ రహస్యాలు.. సగాయింగ్‌ ఫాల్ట్‌ ఎందుకు ప్రమాదకరం..గతంలో సంభవించిన ప్రమాదాలివే!

#Newsbytes Explaner:మయన్మార్‌ భూగర్భ రహస్యాలు.. సగాయింగ్‌ ఫాల్ట్‌ ఎందుకు ప్రమాదకరం..గతంలో సంభవించిన ప్రమాదాలివే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 29, 2025
01:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

మయన్మార్‌లో సంభవించిన భారీ భూకంపం మరోసారి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. ఈ ప్రకృతి విపత్తు ప్రభావంతో ఎత్తైన భవంతులు, పురాతన వంతెనలు సహా అనేక నిర్మాణాలు కుప్పకూలాయి. ప్రాణ నష్టం కూడా గణనీయంగా నమోదైంది. శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం, ఈ భూకంప కేంద్రం మధ్య మయన్మార్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇది 'సగాయింగ్‌ ఫాల్ట్‌' ప్రాంతానికి సమీపంగా ఉంది.

Details

 సగాయింగ్‌ ఫాల్ట్‌ ఏమిటి?

భూమి పైపొరంలో అనేక టెక్టానిక్‌ ప్లేట్లు ఉంటాయి. వీటి సరిహద్దులను ఫాల్ట్స్‌ అని పిలుస్తారు. ఈ ప్లేట్ల మందం కిలోమీటర్ల మేర విస్తరించి ఉంటుందా, అలాగే ఇవి నిరంతరం కదులుతూనే ఉంటాయి. మయన్మార్‌లో ఇండియన్‌ టెక్టానిక్‌ ప్లేట్‌, బర్మా మైక్రోప్లేట్‌ల మధ్య సగాయింగ్‌ ఫాల్ట్‌ (Sagaing Fault) ఉంది. దీని పొడవు దాదాపు 1200 కి.మీ మేర విస్తరించింది. టెక్టానిక్‌ ప్లేట్లు ఎప్పటికప్పుడు కదిలే ప్రక్రియలో ఉంటాయి. సగాయింగ్‌ ఫాల్ట్‌లో ఈ కదలికలు సంవత్సరానికి 11 మి.మీ నుంచి 18 మి.మీ వేగంతో జరుగుతున్నాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

Details

భూకంప కేంద్రం లోతు తక్కువగా ఉంటే నష్టం ఎక్కువ

18 మి.మీ అనే మార్పు పెద్దదిగా పరిగణిస్తారు. దీని ప్రభావం తీవ్రమైనదిగా ఉంటుందని వారు హెచ్చరిస్తున్నారు. ఈ కదలికలు దీర్ఘకాలంగా కొనసాగుతూ ఉండటంతో, ప్లేట్ల అంచుల వద్ద ఒత్తిడి పెరుగుతుంది. ఒకదశలో ఈ ఒత్తిడి మరీ అధికమైతే, భూకంపం సంభవిస్తుంది. భూకంప కేంద్రం లోతు తక్కువగా ఉంటే, నష్టం మరింత పెరుగుతుంది. ఈ ఫాల్ట్‌లైన్లో వేగంగా ప్లేట్లు కదలడం వల్లే మయన్మార్‌ తరచుగా భూకంపాలకు గురవుతోంది.

Details

 గతంలో సంభవించిన పెద్ద భూకంపాలివే 

సగాయింగ్‌ ఫాల్ట్‌ ప్రభావంతో మయన్మార్‌లో గతంలో అనేక భూకంపాలు సంభవించాయి. ఈ ప్రాంతాన్ని రెడ్‌ జోన్‌గా పరిగణిస్తారు. గత 100 సంవత్సరాలలో 6.0 తీవ్రతకు పైబడి 14 ప్రధాన భూకంపాలు సంభవించాయి. 1946లో 7.7 తీవ్రతతో, 1956లో 7.1 తీవ్రతతో భారీ భూకంపాలు సంభవించాయి. 1988లో షాన్‌ ప్రాంతంలో, 2004లో కోకో దీవుల్లో సంభవించిన భూకంపాల వల్ల వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. 2011లో టార్లేలో వచ్చిన భూకంపం 151 మందిని బలితీసుకుంది. 2016లో 6.9 తీవ్రతతో మరోసారి భూమి కంపించింది. ఇప్పుడు తాజాగా 7.7 తీవ్రతతో మరోసారి భూకంపం సంభవించింది.