LOADING...
Babar Azam: సెంచరీ ఆనందంలో ఉన్న బాబర్‌కు షాకిచ్చిన ఐసీసీ
సెంచరీ ఆనందంలో ఉన్న బాబర్‌కు షాకిచ్చిన ఐసీసీ

Babar Azam: సెంచరీ ఆనందంలో ఉన్న బాబర్‌కు షాకిచ్చిన ఐసీసీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 18, 2025
04:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్ స్టార్ క్రికెటర్‌, మాజీ కెప్టెన్‌ బాబార్‌ అజామ్‌కు ఐసీసీ భారీ దెబ్బ ఇచ్చింది. అతని మ్యాచ్‌ ఫీజులో 10 శాతం జరిమానా విధించడమే కాకుండా ఒక డీమెరిట్‌ పాయింట్‌ను కూడా రికార్డులో చేర్చింది. నవంబర్ 16న శ్రీలంక-పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన మూడో వన్డేలో బాబర్‌ ఆజమ్‌ 34 పరుగుల వద్ద ఔట్‌ కావడంతో తీవ్రమైన అసహనానికి గురయ్యాడు. కోపంతో వికెట్లను కాలితో తన్నేశాడు. ఇదే చర్యపై ఐసీసీ సీరియస్‌గా స్పందించింది.

Details

ఐసీసీ ప్రకటన ప్రకారం

'బాబర్‌ ప్రవర్తన ఐసీసీ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ ఆర్టికల్‌ 2.2 ఉల్లంఘన. అంతర్జాతీయ మ్యాచ్ సమయంలో క్రికెట్ పరికరాలు, గ్రౌండ్ ఫిట్టింగ్స్‌ను ధ్వంసం చేయడం లేదా దుర్వినియోగం చేయడం నేరం. దీనిని ఆధారంగా బాబర్‌ డిసిప్లినరీ రికార్డుకు ఒక డీమెరిట్ పాయింట్‌, మ్యాచ్ ఫీజులో 10%కోత విధించాం. గత 24 నెలల్లో అతని తొలి ఉల్లంఘన ఇదే. బాబర్‌ తప్పును అంగీకరించడంతో విచారణ అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ శిక్షతో బాబర్‌ పై మళ్లీ చర్చ మొదలైంది. ఆసక్తికర విషయం ఏమిటంటే—ఈ మ్యాచ్‌కు ముందురోజే బాబర్‌ 83 మ్యాచ్‌ల తర్వాత సెంచరీతో తిరిగి ఫామ్‌ అందుకున్నాడు. రెండో వన్డేలో అతడు 119బంతుల్లో 8 ఫోర్లతో 102* పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.