MAGA activist: టెక్సాస్‌లో హనుమాన్ విగ్రహంపై మాగా మద్దతుదారుడి వివాదాస్పద వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఉన్న ఒక హిందూ దేవుడి విగ్రహంపై 'మాగా' (MAGA) అనుబంధ వ్యక్తి చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ఆ విగ్రహాన్ని భారతీయ వలసదారుల విస్తరణకు ప్రతీకగా చిత్రీకరిస్తూ ఆయన చేసిన సోషల్ మీడియా పోస్టు పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. శ్రీఅష్టలక్ష్మి ఆలయంలో హనుమాన్ విగ్రహం టెక్సాస్ రాష్ట్రంలోని షుగర్ ల్యాండ్ నగరంలో ఉన్న శ్రీఅష్టలక్ష్మి ఆలయం ప్రాంగణంలో 90 అడుగుల ఎత్తైన కాంస్య హనుమాన్ విగ్రహం స్థాపించబడింది. 'స్టాచ్యూ ఆఫ్ యూనియన్'గా ప్రసిద్ధి చెందిన ఈ విగ్రహం ఉత్తర అమెరికాలోనే అత్యంత ఎత్తైన హనుమాన్ విగ్రహంగా గుర్తింపు పొందింది.
వివరాలు
అమెరికాలో మూడో అతిపెద్ద విగ్రహం
ఈ విగ్రహానికి సంబంధించిన వీడియోను మాగా మద్దతుదారుడు కార్లోస్ టుర్సియోస్ (Carlos Turcios) ఎక్స్ వేదికగా పోస్టు చేశాడు. ఆ పోస్టులో ఆయన, వలసదారులు టెక్సాస్‌తో పాటు అమెరికాను క్రమంగా ఆక్రమిస్తున్నారని వ్యాఖ్యానించారు. అమెరికాలో మూడో అతిపెద్ద విగ్రహంగా నిలిచిన ఈ నిర్మాణం ఇక్కడ ఎందుకు అవసరమని ప్రశ్నించారు. అలాగే, ఈ దండయాత్రను ఆపాలంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు.
వివరాలు
కమ్యూనిటీ ప్రతిస్పందన
కార్లోస్ చేసిన వ్యాఖ్యలను ఆలయ కమ్యూనిటీ సభ్యులు తీవ్రంగా ఖండించారు. ఈ విగ్రహం పూర్తిగా ప్రైవేటు స్థలంలో, భక్తుల విరాళాల ద్వారా నిర్మించబడిందని వారు స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల్లో కూడా పలువురు నెటిజన్లు ఆయన వ్యాఖ్యలను తప్పుబడుతూ స్పందిస్తున్నారు. ఇక గతంలో ఇదే విగ్రహంపై రిపబ్లికన్ పార్టీకు చెందిన నాయకుడు అలెగ్జాండర్ డంకన్(Alexander Duncan) కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇది అసలు నిజమైన దేవుడి విగ్రహమే కాదని, ఇలాంటి హిందూ విగ్రహాలను ఇక్కడ అనుమతించాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. ఆయన వ్యాఖ్యలను Hindu American Foundation తీవ్రంగా ఖండిస్తూ అభ్యంతరం వ్యక్తం చేసింది.