Andhra Pradesh: ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ ట్యూటర్.. ప్రయోగాత్మకంగా అమలు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారిత ట్యూటర్ వ్యవస్థను ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. ఐఐటీ మద్రాస్(Indian Institute of Technology Madras) రూపొందించిన డిజిటల్ లెర్నింగ్ విధానాన్ని ప్రాయోగికంగా ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేయాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి సంబంధించి ఢిల్లీలో నిర్వహిస్తున్నఏఐ ఇంపాక్ట్ సదస్సులో ఈ నెల 20వ తేదీ (శుక్రవారం) పాఠశాల విద్యాశాఖ,ఐఐటీ మద్రాస్ మధ్య అవగాహన ఒప్పందం కుదరనుంది. ఈ సాంకేతిక సేవలను ఐఐటీ మద్రాస్ ప్రభుత్వ పాఠశాలలకు ఉచితంగా అందించనుంది. పాఠశాల విద్యాశాఖ వద్ద ఉన్న విద్యా కంటెంట్‌ను ఐఐటీ మద్రాస్‌కు అందజేసి,అక్కడి నుంచి విద్యార్థుల పరికరాలకు పంపిణీ చేస్తారు. ఈ కంటెంట్ తెలుగు,ఆంగ్లం,హిందీ భాషల్లో అందుబాటులో ఉంటుంది.
వివరాలు
పాఠాలను స్వయంగా ఎంపిక చేసుకుని..
ఈ ఏఐ ట్యూటర్ మొబైల్ యాప్, వెబ్ ప్లాట్‌ఫాం, వాట్సాప్ ఇంటర్‌ఫేస్‌ల ద్వారా పనిచేస్తుంది. విద్యార్థులు తమకు ఇష్టమైన పాఠాలను స్వయంగా ఎంపిక చేసుకుని అభ్యసించవచ్చు. వారు ఎంతవరకు అర్థం చేసుకున్నారో తెలుసుకునేందుకు తక్షణ ప్రశ్నలు ఇస్తుంది. విద్యార్థులు ఇచ్చే సమాధానాల ఆధారంగా వారి అభ్యాస స్థాయి మరియు నేర్చుకునే సామర్థ్యాన్ని విశ్లేషించి అంచనా వేస్తుంది.
వివరాలు
ముఖ్య లక్షణాలు
పాఠశాలల్లో స్వీయ అభ్యాస సంస్కృతిని ప్రోత్సహిస్తుంది పాఠ్యాంశాలకు అనుగుణంగా సంభాషణాత్మక బోధన అందిస్తుంది వాయిస్,టెక్స్ట్ ఆధారిత పరస్పర చర్యకు అవకాశం కల్పిస్తుంది విద్యార్థుల గత అభ్యాస వివరాల ఆధారంగా సందర్భానుసార సమాధానాలు అందిస్తుంది తాత్కాలిక పునశ్చరణ (రెమిడియల్ కోచింగ్)పై ఆధారపడే అవసరాన్ని తగ్గిస్తుంది వినియోగం,అభ్యాస ధోరణులపై ప్రత్యేక డ్యాష్‌బోర్డులు అందిస్తుంది తరగతి బోధనను మరింత బలపరుస్తుంది పాఠ్యపుస్తకాలు,దీక్ష,ఎస్‌సీఈఆర్టీ,ఎన్‌సీఈఆర్టీ విద్యా సామగ్రిని సమర్థంగా వినియోగిస్తుంది తప్పుదారి పట్టించే సమాధానాలు రాకుండా నియంత్రిత వ్యవస్థను అమలు చేస్తుంది అమలు విధానం విద్యార్థులు తమ ఇళ్లలో ఉన్నమొబైల్ ఫోన్ల ద్వారా లేదా పాఠశాలలలోని కంప్యూటర్ ల్యాబ్‌ల ద్వారా ఏఐ ట్యూటర్‌ను ఉపయోగించవచ్చు. అదనంగా,కొన్ని పాఠశాలల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్యాబ్‌ల ద్వారా కూడా ఈ సదుపాయాన్ని పొందగలరు.