LOADING...
Dhurandhar 2: ఉగాది ట్రీట్‌..థియేటర్లలో దూసుకుపోతున్న 'ధురంధర్ 2'
ఉగాది ట్రీట్‌..థియేటర్లలో దూసుకుపోతున్న 'ధురంధర్ 2'

Dhurandhar 2: ఉగాది ట్రీట్‌..థియేటర్లలో దూసుకుపోతున్న 'ధురంధర్ 2'

వ్రాసిన వారు Moogati Shabari
Mar 19, 2026
09:24 am

ఈ వార్తాకథనం ఏంటి

ఉగాది సీజన్‌లో ఆదిత్యధర్‌ ప్రేక్షకులకు 'ధురంధర్ 2' సినిమా ద్వారా యాక్షన్‌ ట్రీట్‌ అందించారు. రణ్‌వీర్‌ సింగ్‌ హీరోగా 'ధురంధర్: ది రివెంజ్‌' థియేటర్లలోకి అడుగుపెట్టి భారీగా విజయం సాధిస్తోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం, ప్రేక్షకుల నుండి హిట్ టాక్ పొందుతోంది. బాక్సాఫీస్‌ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. ఈ మూవీపై నెటిజన్లు, సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

వివరాలు

సినిమాలో ప్రతి సీనూ హైలెట్

ధురంధర్ 2 చూశానని, దేశభక్తిని స్టైలిష్‌గా చూపించిన విధానం అద్భుతంగా ఉందని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అన్నారు. ప్రతి భారతీయుడు గర్వపడేలా ఈ మూవీ ఉందన్నారు. సినిమాలో పట్టు, ఉత్కంఠభరితమైన సీన్స్ చాలా బావున్నాయన్నారు. ఒక మాటలో చెప్పాలంటే ఇది నిజమైన బ్లాస్ట్ అని బన్నీ అన్నారు. తన ఫ్రెండ్ రణ్‌వీర్‌ సింగ్‌ లాంటి అద్భుత నటుడు మన దేశంలో ఉన్నందుకు చాలా గర్వంగా ఉందన్నారు. రణ్‌వీర్‌ 'ఫైర్‌' అనే పదానికి నిర్వచనం అని అన్నారు. మాధవన్‌ సహా మిగతా నటీనటులు కూడా అదరగొట్టారన్నారు. ఆదిత్యధర్‌ ప్రతిభ, ఆలోచనలతో అందర్నీ ఉర్రూతలూగించారని, ఒక భారతీయ కథను అంతర్జాతీయ స్థాయిలో అద్భుతంగా తెరపై చూపించారని అల్లు అర్జున్ ప్రశంసలు కురిపించారు.

వివరాలు

సినిమా నుంచి బయటకురాలేకపోతున్నారు..

ధురంధర్ 2 చూసిన ప్రతి వ్యక్తి తనతో ఒకే మాట అంటున్నారని విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అన్నారు. వారికి సినిమా నచ్చడం మాత్రమే కాదు.. అది ఊహించని విధంగా ప్రభావితం చేస్తోందన్నారు. వారు దాని నుండి బయటకు రాలేకపోతున్నారన్నారు. ధురంధర్2 లాంటి సినిమా రావడం అందరికీ స్పూర్తినిచ్చే అంశం అని డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ అన్నారు.

Advertisement