LOADING...
Taiwan Earthquake: తైవాన్‌ను వణికించిన భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 7 తీవ్రత
తైవాన్‌ను వణికించిన భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 7 తీవ్రత

Taiwan Earthquake: తైవాన్‌ను వణికించిన భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 7 తీవ్రత

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 28, 2025
08:55 am

ఈ వార్తాకథనం ఏంటి

వరల్డ్‌వైడ్‌గా తరచుగా చోటుచేసుకుంటున్న భూకంపాలు ప్రజల్లో భయాందోళన కలిగిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా తైవాన్‌ను భారీ భూకంపం కుదిపేసింది. దేశ ఈశాన్య తీరంలో 7.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంపం ధాటికి భవనాలు బలంగా కంపించగా, నివాసితులు ప్రాణ భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. యిలాన్ నగరం నుంచి సుమారు 32 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మూడు రోజుల వ్యవధిలో తైవాన్‌ను వణికించిన రెండవ బలమైన భూకంపం ఇదేనని సమాచారం. రాజధాని తైపీలో కూడా భూకంపం ప్రభావం కనిపించిందని, అక్కడ భవనాలు కంపించాయని జాతీయ అగ్నిమాపక సంస్థ వెల్లడించింది.

Details

కొద్దిసేపు విద్యుత్ సరఫరా నిలిపివేత

ప్రస్తుతానికి ప్రాణ, ఆస్తి నష్టంపై అంచనాలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. భూకంపం అనంతరం యిలాన్ ప్రాంతంలో సుమారు 3,000 ఇళ్లకు కొద్దిసేపు విద్యుత్ సరఫరా నిలిచిపోయినట్లు తైవాన్ ఇంధన సంస్థ తెలిపింది. రెండు టెక్టోనిక్ ప్లేట్ల సంగమ ప్రాంతంలో ఉన్న తైవాన్‌ను భూకంపాలకు అత్యంత సున్నితమైన ప్రాంతంగా పరిగణిస్తారు. గతంలోనూ ఇక్కడి భూకంపాలు తీవ్ర నష్టాన్ని మిగిల్చిన దాఖలాలు ఉన్నాయి. 2016లో దక్షిణ తైవాన్‌లో సంభవించిన భూకంపంలో 100 మందికి పైగా మృతి చెందగా, 1999లో 7.3 తీవ్రతతో వచ్చిన భూకంపం 2,000 మందికి పైగా ప్రాణాలు తీసింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైరల్ అవుతున్న వీడియో

Advertisement