
Telangana: తెలంగాణలో మళ్లీ భూకంపం భయం..? రామగుండం పరిసరాల్లో హెచ్చరికలు!
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భూకంపం సంభవించే అవకాశముందని 'ఎర్త్‌కేక్ రీసెర్చ్ అండ్ అనాలసిస్' సంస్థ హెచ్చరికలు జారీ చేసింది.
రామగుండం ప్రాంతం వద్ద భారీ భూకంపం సంభవించే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీని ప్రభావం హైదరాబాద్, వరంగల్, అమరావతి, మహారాష్ట్ర వరకూ కనిపించవచ్చని వివరించారు.
అయితే ఈ అంచనాలను ఇప్పటివరకు ప్రభుత్వం లేదా అధికారిక శాస్త్రీయ సంస్థలు ధృవీకరించలేదు.
భూకంపాలను ముందస్తుగా అంచనా వేయడం సాధ్యపడదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
గతంలో డిసెంబర్ 4, 2024న ములుగు జిల్లా మేడారం సమీపంలో 5.3 తీవ్రతతో భూకంపం సంభవించింది.
Details
తక్కువ భూకంప తీవ్రత కలిగిన జోన్-2గా ఏర్పాటు
దీని ప్రభావం హైదరాబాద్, వరంగల్, ఖమ్మం సహా ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల వరకు కూడా కనిపించింది.
అయితే తెలంగాణ భూభాగం సాధారణంగా తక్కువ భూకంప తీవ్రత కలిగిన జోన్-2కు చెందుతుంది.
గోదావరి పరివాహక ప్రాంతంలో ఫాల్ట్ జోన్ ఉన్న నేపథ్యంలో అక్కడ అప్పుడప్పుడు స్వల్ప భూకంపాలు సంభవించే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
గతంలో జరిగిన భూకంపాలు పెద్దగా నష్టం కలిగించలేదని వారు గుర్తుచేశారు.
ఇటీవల పెద్దపల్లి జిల్లాకు సంబంధించి భూకంప హెచ్చరికలు ఉన్నట్లు 'ఎర్త్‌క్వేక్ రీసెర్చ్ అండ్ అనాలసిస్' సంస్థ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Details
గతంలోనూ భూకంపాలు
అయినా ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భారత వాతావరణ శాఖ (IMD) అధికారులు స్పష్టం చేశారు.
భూకంపాల చరిత్రను పరిశీలిస్తే, 1969లో ప్రకాశం జిల్లా ఒంగోలులో 5.1 తీవ్రతతో, 1998లో ఆదిలాబాద్ జిల్లాలో 4.5 తీవ్రతతో భూకంపాలు నమోదయ్యాయి.
అలాగే 1984, 1999, 2013 సంవత్సరాల్లో హైదరాబాద్ పరిసరాల్లో స్వల్ప భూకంపాలు సంభవించినట్లు రికార్డులు చూపిస్తున్నాయి.
నిపుణులు భూకంపాలు ఎప్పుడెప్పుడు సంభవిస్తాయో ముందుగానే చెప్పడం కష్టమని తెలిపారు. అయినా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.