LOADING...
Vijayawada: జోగి రమేష్‌ ఇంటికి నిప్పు.. ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్తత
జోగి రమేష్‌ ఇంటికి నిప్పు.. ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్తత

Vijayawada: జోగి రమేష్‌ ఇంటికి నిప్పు.. ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్తత

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 01, 2026
05:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్‌పై నిన్న చేసిన అనుచిత వ్యాఖ్యలకు వ్యతిరేకంగా వైసీపీ నేత జోగి రమేష్‌కు తెలుగుదేశం శ్రేణుల నుంచి నిరసన సెగ తగలింది. ఇబ్రహీంపట్నంలోని రమేష్ నివాసానికి పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు చేరి ముట్టడించినట్లు సమాచారం. ఆందోళనకారులు ఇంటిపై అగ్గి పెట్టి నిరసన తెలియజేశారు. సమాచారం అందుకున్న పోలీసులు పెద్ద ఎత్తున ఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకారులను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలిరావడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత పెరిగింది. ఈ ఘటన స్థానికంగా ఉద్రిక్తతను రేకెత్తించగా, పోలీస్ సిబ్బంది శాంతియుత పరిష్కారం కోసం తక్షణ చర్యలు తీసుకుంటున్నారు.

Advertisement