LOADING...
Earthquake: భూకంపం బీభత్సం.. పేకమేడల్లా కూలిన భవనాలు, బాధితుల ఆర్తనాదాలు (వీడియో) 
భూకంపం బీభత్సం.. పేకమేడల్లా కూలిన భవనాలు, బాధితుల ఆర్తనాదాలు (వీడియో)

Earthquake: భూకంపం బీభత్సం.. పేకమేడల్లా కూలిన భవనాలు, బాధితుల ఆర్తనాదాలు (వీడియో) 

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 28, 2025
04:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

మయన్మార్, థాయ్‌ల్యాండ్‌లలో సంభవించిన భూకంపం (Earthquake) తీవ్ర విధ్వంసాన్ని సృష్టించింది. రిక్టర్ స్కేలుపై 7.7 తీవ్రతతో నమోదైన ఈ భూకంపం కారణంగా అనేక భారీ భవనాలు నేలమట్టం అయ్యాయి. భయంతో ప్రజలు రోడ్లపైకి పరుగులు తీస్తున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. భూకంప ప్రభావం ఒక్కచోట ఓ భారీ భవనం కుప్పకూలగా, శిథిలాల కింద చిక్కుకున్న ఓ కార్మికుడు సాయం కోసం ఆర్తనాదాలు చేస్తున్న దృశ్యాలు హృదయాన్ని కలచివేస్తున్నాయి. శిథిలాల కింద ఇంకా అనేక మంది చిక్కుకున్నట్లు భావిస్తున్న అధికారులు, సహాయ బృందాలతో రక్షణ చర్యలు ముమ్మరం చేశారు.

Details

 మయన్మార్‌లోనూ ఇదే పరిస్థితి 

మాండలే నగరంలో అనేక భవనాలు కూలిపోయాయి. ఇప్పటివరకు 13 మంది మృతి చెందగా, 200 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. ప్రభుత్వం అనేక ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. థాయ్‌ల్యాండ్‌లో నష్టనివారణ చర్యలు భూకంప ప్రభావంతో బ్యాంకాక్‌లో భారీ ఆస్తి నష్టం సంభవించింది. థాయ్‌ల్యాండ్‌ ప్రధాని పేటోంగ్టార్న్‌ షినవత్ర దేశవ్యాప్తంగా అలర్ట్‌లు జారీ చేశారు. ప్రభావిత ప్రాంతాలను 'ఎమర్జెన్సీ జోన్'‌గా ప్రకటించారు. ప్రస్తుతం మయన్మార్, థాయ్‌ల్యాండ్‌లలో రెస్క్యూ టీములు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

శిథిలాల కింద చిక్కుకున్న కార్మికుడు