AP Job Calendar 2026: ఏపీ జాబ్ క్యాలెండర్ 2026 రిలీజ్.. 10,060 పోస్టులకు గ్రీన్ సిగ్నల్
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉగాది సందర్భంగా శుభవార్త అందించింది. 2026 సంవత్సరానికి సంబంధించిన జాబ్ క్యాలెండర్‌ను అధికారికంగా విడుదల చేస్తూ మొత్తం 10,060 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఉగాది పర్వదినాన మంత్రి నారా లోకేశ్ ఈ క్యాలెండర్‌ను విడుదల చేశారు. వివిధ శాఖల్లో భారీగా ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ జాబ్ క్యాలెండర్‌లో పాఠశాల విద్య, ఇంటర్ విద్యా శాఖల్లోనే అత్యధికంగా 3004 పోస్టులు ఉన్నాయి. హోమ్ శాఖలో 2778 పోస్టులు, ఉన్నత విద్యా శాఖలో 1500 పోస్టులు భర్తీ చేయనున్నారు. గ్రూప్-1లో 91 పోస్టులు, గ్రూప్-2లో 750 పోస్టులు, ఇంజనీరింగ్ విభాగంలో 503 పోస్టులు ప్రకటించారు.
Details
స్కూల్ ఎడ్యుకేషన్‌లో 3004 పోస్టులు
ఇతర శాఖల్లో 928 పోస్టులతో పాటు అదనంగా మరో 506 పోస్టులను కూడా చేర్చారు. విభాగాల వారీగా చూస్తే స్కూల్ ఎడ్యుకేషన్‌లో 3004 పోస్టులు, హోమ్ శాఖలో మొత్తం 3057 పోస్టులు, హయ్యర్ ఎడ్యుకేషన్‌లో 1500 ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయి. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖలో 452 పోస్టులు, పంచాయతీ రాజ్ & గ్రామీణాభివృద్ధి విభాగంలో 328 పోస్టులు, వాటర్ రిసోర్సెస్ శాఖలో 224 ఏఈఈ పోస్టులు ఉన్నాయి. ఫైనాన్స్ విభాగంలో 169 పోస్టులు, అడవులు & పర్యావరణ శాఖలో 140 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇక నోటిఫికేషన్ షెడ్యూల్‌ను కూడా ప్రభుత్వం వెల్లడించింది.
Details
గ్రూప్-2లో 750 పోస్టులు
గ్రూప్-1 (91 పోస్టులు), హోమ్ శాఖ (2778 పోస్టులు), ఇతర శాఖలు (928 పోస్టులు)కు సంబంధించిన నోటిఫికేషన్లు ఆగస్టు 15న విడుదల కానున్నాయి. స్కూల్ ఎడ్యుకేషన్ (3004 పోస్టులు)కు మే 15న నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. గ్రూప్-2 (750 పోస్టులు), ఇంజనీరింగ్ (503 పోస్టులు), ఇతర పోస్టులు (506)కు సెప్టెంబర్ 15న నోటిఫికేషన్లు జారీ చేయనున్నారు. ఈ జాబ్ క్యాలెండర్ ద్వారా రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం యువతలో కొత్త ఆశలు నింపింది.