LOADING...
Earthquake: అఫ్గనిస్థాన్‌-తజికిస్థాన్‌ సరిహద్దులో భూకంపం.. దిల్లీలోనూ ప్రకంపనలు
అఫ్గనిస్థాన్‌-తజికిస్థాన్‌ సరిహద్దులో భూకంపం.. దిల్లీలోనూ ప్రకంపనలు

Earthquake: అఫ్గనిస్థాన్‌-తజికిస్థాన్‌ సరిహద్దులో భూకంపం.. దిల్లీలోనూ ప్రకంపనలు

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 19, 2025
01:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆఫ్ఘనిస్తాన్, తజికిస్థాన్ సరిహద్దు ప్రాంతాల్లో శనివారం మధ్యాహ్నం సమయంలో భూకంపం సంభవించింది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.8గా నమోదైంది.భూకంప కేంద్రం సుమారు 86 కిలోమీటర్ల దూరంలో నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (జాతీయ భూకంప పరిశోధనా సంస్థ) వెల్లడించింది. ఇక ఈ ప్రకంపనలు భారతదేశానికి చెందిన పలు ప్రాంతాల్లోనూ ప్రభావం చూపాయి. ముఖ్యంగా ఢిల్లీ, జమ్మూ కశ్మీర్‌తో పాటు ఉత్తర భారతదేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ భూకంప ప్రభావం కనిపించింది. ఆకస్మికంగా భూమి కంపించడంతో ప్రజల్లో ఆందోళన చెలరేగింది. భయంతో పలువురు వారు నివసిస్తున్న ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

 నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ  చేసిన ట్వీట్