ఆఫ్ఘనిస్తాన్: వార్తలు
22 Mar 2023
భూకంపంఅఫ్గానిస్థాన్లో భూకంపం వస్తే ఉత్తర భారతంలో భారీ ప్రకంపనలు రావడానికి కారణాలు తెలుసా?
అఫ్ఘానిస్థాన్‌లో మంగళవారం రాత్రి 6.5 తీవ్రతతో భారీ భూకంపం వచ్చింది. ఈ భూకంపం ధాటికి ఉత్తర భారతదేశంలోని దిల్లీ, పంజాబ్, రాజస్థాన్‌లోని జైపూర్, జమ్ముకశ్మీర్‌లో ప్రకంపనలు సంభవించాయి. ఆఫ్ఘనిస్థాన్‌లో భూకంపం వస్తే దాని ప్రకంపనలు ఉత్తర భారతంలో ఎందుకొచ్చాయో ఇప్పుడు తెలుసుకుందాం.
22 Mar 2023
భూకంపంపాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్‌లో భారీ భూకంపం; 11మంది మృతి; ఉత్తర భారతంలోనూ ప్రకంపనలు
పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్‌లో భారీ భూకంపం సంభవించింది. భూకంపం దాటికి పాకిస్థాన్‌లో 11మంది మృతి చెందినట్లు ప్రముఖ వార్తా సంస్థ అసోసియేటెడ్ ప్రెస్ నివేదించింది.
14 Mar 2023
తాలిబాన్తాలిబాన్ ప్రతినిధులకు ఆన్‌లైన్ క్రాష్ కోర్సులో భారత్ శిక్షణ
అఫ్ఘానిస్థాన్‌లోని తాలిబాన్ ప్రభుత్వ సభ్యులు మంగళవారం నుంచి ప్రారంభమయ్యే 'ఇండియా ఇమ్మర్షన్' ఆన్‌లైన్ కోర్సుకు హాజరయ్యారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఐఐఎం-కోజికోడ్‌లో ఈ ఆన్ లైన్ క్రాష్ కోర్సును నిర్వహిస్తోంది. మార్చి 14 నుంచి మార్చి 17 వరకు ఆన్‌లైన్ శిక్షణ ఇస్తున్నారు.
08 Mar 2023
భారతదేశంచాబహార్ ఓడరేవు ద్వారా ఆఫ్ఘనిస్తాన్‌కు 20,000 మెట్రిక్ టన్నుల గోధుమలను పంపనున్న భారత్
అఫ్ఘనిస్తాన్‌కు 20,000 మెట్రిక్ టన్నుల గోధుమల్ని సరఫరా చేయబోతున్నట్లు భారత్ మంగళవారం ప్రకటించింది . ఇండియా-సెంట్రల్ ఏసియా జాయింట్ వర్కింగ్ గ్రూప్ తొలి సమావేశం జరిగిన వెంటనే అఫ్ఘాన్‌కు భారత్ గోధుమలు సరఫరా చేయడానికి నిర్ణయం తీసుకుంది.
28 Feb 2023
ఆఫ్ఘనిస్తాన్అఫ్ఘనిస్థాన్: ఇస్లామిక్ స్టేట్ టాప్ కమాండర్‌ను హతమార్చిన తాలిబాన్ దళాలు
అఫ్ఘానిస్థాన్ రాజధాని కాబూల్‌లో తాలిబాన్ భద్రతా దళాలు ఇస్లామిక్ స్టేట్ గ్రూపుకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చాయి. మూడో వ్యక్తిని అఫ్ఘాన్ రాజధాని కాబూల్‌లో సోమవారం రాత్రి అదుపులోకి తీసుకున్నట్లు తాలిబాన్ ప్రభుత్వ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ తెలిపారు.
13 Feb 2023
భూకంపంఅఫ్గానిస్థాన్లో భూకంపం, రిక్టర్ స్కేలుపై 4.3 తీవ్రత
అఫ్గానిస్థాన్‌లో భూకంపం సంభవించింది. అఫ్గాన్‌లోని ఫైజాబాద్‌లో రిక్టర్ స్కేలుపై 4.3 తీవ్రతతో ప్రకంపనలు సంభవించినట్లు అధికారులు చెప్పారు.
02 Feb 2023
పాకిస్థాన్పెషావర్ మసీదు పేలుడు ఇంటిదొంగ పనేనా? నిగ్గు తేల్చాలని పాకిస్థాన్‌లో నిరసనలు
పాకిస్థాన్‌లో పెషావర్‌లోని మసీదులో జరిగిన ఆత్మాహుతి బాంబు దాడిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కట్టుదిట్టమైన భద్రతను దాటి, బాంబర్ ఈ దాడికి పాల్పడ్డాడంటే ఇందులో ఇంటి దొంగల హస్తం ఉందనే ప్రచారం జరుగుతోంది.
30 Jan 2023
పాకిస్థాన్Pakistan Blast: పాకిస్థాన్ మసీదులో ఆత్మాహుతి దాడి, 25మంది మృతి
పాకిస్థాన్‌లో దారుణం జరిగింది. పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లోని మసీదులో ఆత్మాహుతి దాడి జరిగి 25మంది మృతి చెందగా, మరో 120 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుకు సమీపంలోని వాయువ్య నగరం పెషావర్‌లో మధ్యాహ్నం ప్రార్థనల సమయంలో ఈ సంఘటన జరిగింది.
18 Jan 2023
ఆఫ్ఘనిస్తాన్అప్ఘానిస్థాన్: దొంగతనానికి పాల్పడిన నలుగురి చేతులను నరికేసిన తాలిబన్లు
అప్ఘానిస్థాన్‌లోని తాలిబన్ల ప్రభుత్వం దారుణానికి ఒడిగట్టింది. దొంగతనాలతో పాటు చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతున్న వారికి కఠిన శిక్షలను అమలు చేస్తోంది. తాజాగా కాందహార్‌లో దొంగతనానికి పాల్పడిన తొమ్మిది మందికి కఠిన శిక్షను అమలు చేసింది.
17 Jan 2023
ఆఫ్ఘనిస్తాన్స్వదేశంలో మొట్టమొదటిసారి రూపొందిన సూపర్‌కార్ మాడా 9ను ఆవిష్కరించిన తాలిబన్లు
ఆఫ్ఘనిస్తాన్ లో మొట్టమొదటి తయారుచేసిన మాడా 9 అనే సూపర్‌కార్‌ను ఆవిష్కరించింది తాలిబాన్. ENTOP అనే సంస్థ ఈ వాహనాన్ని ఐదు సంవత్సరాలు రూపొందించింది. అద్భుతమైన పనితీరుతో పాటు స్టైలిష్ గా కనిపిస్తున్న ఈ కార్ టయోటా కరోలా ఇంజిన్ తో నడుస్తుంది. భవిష్యత్తులో ఎలక్ట్రిక్ పవర్‌ట్రైన్ కూడా వచ్చే అవకాశముంది.
11 Jan 2023
ఆఫ్ఘనిస్తాన్స్కూళ్లు, కాలేజీల్లో బాలికల నిషేధంపై మాటమార్చిన తాలిబాన్లు
అఫ్గానిస్థాన్‌లో పాఠశాలలు, విశ్వవిద్యాలయాల్లో బాలికల విద్యపై తాలిబాన్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. బాలికల విద్యను శాశ్వతంగా నిషేధించలేదని చెప్పింది. తాత్కాలికంగా వాయిదా వేసినట్లు పేర్కొంది.
30 Dec 2022
ఆఫ్ఘనిస్తాన్అప్ఘనిస్తాన్ టీ20 కెప్టెన్‌గా రషీద్ ఖాన్
అప్ఘనిస్తాన్ ఆల్ రౌండర్ రషీద్ ఖాన్ టీ20 కెప్టెన్ గా నియమితులయ్యారు. మహమ్మద్ నబీ స్థానంలో అఫ్ఘాన్ క్రికెట్ బోర్డు రషీద్ కు జట్టు పగ్గాలను అప్పగించింది.