LOADING...
TG 10th Exams : తెలంగాణలో టెన్త్ ఎగ్జామ్స్‌ షురూ.. పరీక్షల పూర్తి షెడ్యూల్‌, ముఖ్య సూచనలివే!
తెలంగాణలో టెన్త్ ఎగ్జామ్స్‌ షురూ.. పరీక్షల పూర్తి షెడ్యూల్‌, ముఖ్య సూచనలివే!

TG 10th Exams : తెలంగాణలో టెన్త్ ఎగ్జామ్స్‌ షురూ.. పరీక్షల పూర్తి షెడ్యూల్‌, ముఖ్య సూచనలివే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 14, 2026
09:43 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ‌లో 10వ తరగతి (SSC) పబ్లిక్‌ పరీక్షలు శనివారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షలు నేటి నుంచి ఏప్రిల్‌ 16 వరకు కొనసాగనున్నాయి. ప్రతిరోజూ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5,17,727 మంది రెగ్యులర్‌ విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. వారిలో 2,60,916 మంది అబ్బాయిలు, 2,56,811 మంది అమ్మాయిలు ఉన్నారు. అలాగే గతంలో ఫెయిల్‌ అయినవారు లేదా పరీక్షలకు హాజరు కాలేకపోయిన 10,512 మంది విద్యార్థులు కూడా ఈసారి పరీక్షలు రాయనున్నారు.

Details

2,676 పరీక్షా కేంద్రాల ఏర్పాటు

పరీక్షల నిర్వహణ కోసం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,676 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు కనీసం అరగంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని విద్యాశాఖ అధికారులు సూచించారు. ఈసారి పరీక్షల నిర్వహణలో కొన్ని మార్పులు కూడా చేశారు. ముఖ్యంగా ఐదు నిమిషాల మినహాయింపు నిబంధనను అమలు చేస్తున్నారు. పరీక్ష ఉదయం 9.30 గంటలకు ప్రారంభమైనప్పటికీ విద్యార్థులను 9.35 గంటల వరకు పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. ఆ తర్వాత వచ్చే వారికి పరీక్ష రాసే అవకాశం ఉండదు.

Details

విద్యార్థులు గుర్తుంచుకోవాల్సిన సూచనలు

మొదటి రోజు పరీక్షకు కనీసం 45 నిమిషాల ముందే కేంద్రానికి చేరుకోవాలి. మిగిలిన రోజుల్లో అరగంట ముందే వెళ్లితే ప్రశాంతంగా పరీక్ష రాయవచ్చు. ఓఎంఆర్‌ షీట్‌లోని వివరాలను జాగ్రత్తగా పరిశీలించి సరిగా నింపాలి. పరీక్ష కేంద్రంలోకి వెళ్లిన తర్వాత చదవడం మానేసి ప్రశాంతంగా ఉండాలి. ప్రశ్నాపత్రంలోని ప్రశ్నలను పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే జవాబులు రాయాలి. వేసవి తీవ్రత దృష్ట్యా పరీక్షకు వెళ్లే ముందు పండ్లు, మజ్జిగ, పళ్లరసాలు లేదా తేలికపాటి అల్పాహారం తీసుకోవడం మంచిది. వదులుగా ఉండే కాటన్‌ దుస్తులు ధరించడం ఉత్తమం. అలసట లేదా నీరసం అనిపిస్తే వెంటనే అక్కడి వైద్య సిబ్బందిని సంప్రదించాలి. ఉదయం 9.35 గంటల తర్వాత పరీక్షా కేంద్రంలోకి ప్రవేశానికి అనుమతి ఉండదు.

Advertisement

Details

తెలంగాణ SSC పరీక్షల షెడ్యూల్‌ - 2026

మార్చి 14 (శనివారం): ఫస్ట్‌ లాంగ్వేజ్‌ (గ్రూప్‌-A), ఫస్ట్‌ లాంగ్వేజ్‌ పార్ట్‌-I, పార్ట్‌-II మార్చి 18 (బుధవారం): సెకండ్‌ లాంగ్వేజ్‌ * మార్చి 23 (సోమవారం): థర్డ్‌ లాంగ్వేజ్‌ (ఇంగ్లీష్‌) మార్చి 28 (శనివారం): మ్యాథమెటిక్స్‌ * ఏప్రిల్‌ 2 (గురువారం): సైన్స్‌ పార్ట్‌-I (ఫిజికల్‌ సైన్స్‌) ఏప్రిల్‌ 7 (మంగళవారం): సైన్స్‌ పార్ట్‌-II (బయోలాజికల్‌ సైన్స్‌) * ఏప్రిల్‌ 13 (సోమవారం): సోషల్‌ స్టడీస్‌ ఏప్రిల్‌ 15 (బుధవారం): ఓఎస్‌ఎస్‌సీ మెయిన్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-I (సంస్కృతం, అరబిక్‌), ఎస్‌ఎస్‌సీ వొకేషనల్‌ కోర్స్‌ (థియరీ) ఏప్రిల్‌ 16 (గురువారం): ఓఎస్‌ఎస్‌సీ మెయిన్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-II (సంస్కృతం, అరబిక్‌).

Advertisement