Page Loader
IND vs AFG: మూడో టీ20లో సంజు శాంసన్‌కు చోటు దక్కుతుందా? 
IND vs AFG: మూడో టీ20లో సంజు శాంసన్‌కు చోటు దక్కుతుందా?

IND vs AFG: మూడో టీ20లో సంజు శాంసన్‌కు చోటు దక్కుతుందా? 

వ్రాసిన వారు Stalin
Jan 17, 2024
12:59 pm

ఈ వార్తాకథనం ఏంటి

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో టీమిండియా, అఫ్గానిస్థాన్ మధ్య బుధవారం మూడో టీ20 జరగనుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటికే 2-0 ఆధిక్యంలో ఉన్న టీమిండియా.. మూడో టీ20 కూడా గెలిచి క్లీన్ స్వీప్ చేయాలనే ఉద్దేశ్యంతో ఉంది. ఈ సిరీస్ తర్వాత భారత జట్టు నేరుగా టీ20 ప్రపంచ కప్ 2024లో ఆడనుంది. ఈ క్రమంలో మూడో టీ20 మ్యాచ్‌లో ప్లేయింగ్ ఎలెవన్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్ కొన్ని మార్పులు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎలాగూ టీమిండియా సిరిస్ గెలిచింది, కాబట్టి.. చివరి టీ20లో బెంచ్‌పై కూర్చున్న ఆటగాళ్లకు అవకాశం కల్పించే అవకాశం ఉంది. ఒకవేళ అలా చేస్తే.. సంజూ శాంసన్ ప్లేయింగ్ ఎలెవన్‌లోకి తిరిగి రావచ్చు.

టీమిండియా

రోహిత్ శర్మపై ఒత్తిడి

శాంసన్‌తో పాటు కుల్దీప్ యాదవ్, అవేశ్ ఖాన్‌ కూడా ప్లేయింగ్-11లో స్థానం దక్కించుకునే అవకాశం ఉంది. ఒకవేళ కుల్‌దీప్‌ జట్టులోకి వస్తే, రవి బిష్ణోయ్‌ లేదా వాషింగ్టన్‌ సుందర్‌కు విశ్రాంతి ఇవ్వొచ్చు. ఇదిలా ఉంటే, సిరీస్‌లోని మొదటి రెండు మ్యాచ్‌లలో కెప్టెన్ రోహిత్ శర్మ తన ఖాతా తెరవలేకపోయాడు. టీ20 ప్రపంచకప్‌కు ముందు తిరిగి ఫామ్‌లోకి రావాలంటే మూడో మ్యాచ్‌లో భారీ ఇన్నింగ్స్ ఆడాలని అతనిపై ఒత్తిడి ఉంది. ఈ సిరీస్‌లో శివమ్ దూబే ఇప్పటివరకు రెండు ఇన్నింగ్స్‌లలో హాఫ్ సెంచరీలతో అదరగొట్టాడు. మూడో మ్యాచ్‌లో కూడా అతని నుంచి అదే విధమైన ప్రదర్శన ఆశించవచ్చు.