
Zakia Wardak-Resigned: బంగారం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ ఆఫ్ఘన్ దౌత్యవేత్త రాజీనామా
ఈ వార్తాకథనం ఏంటి
భారత్(India) లో ఆఫ్ఘనిస్థాన్ (Afghan) తాత్కాలిక రాయబారిగా ఉన్న జకియా వార్దక్ (Zakia Wardak) రాజీనామా (Resigned)చేశారు.
గతనెలలో ముంబై (Mumbai) విమానాశ్రయం(Airport) లో దుబాయ్ (Dubai) నుంచి రూ.18.6 కోట్ల విలువైన 25 కిలోల బంగారాన్ని స్మగ్లింగ్ (Gold Smuggling) చేస్తూ పట్టుబడిన కొద్ది రోజులకే జకియా వార్దక్ రాజీనామా చేశారు.
దుబాయ్ నుంచి బంగారం స్మగ్లింగ్ చేసినట్లు వార్తలు రావడంతో భారత్ లోని ఈ సీనియర్ ఆఫ్ఘన్ దౌత్యవేత్త తన పదవికి రాజీనామా చేశారు.
యూఏఈ రాజధాని నుంచి 25 కేజీల బంగారాన్నిఅక్రమంగా తరలించేందుకు ప్రయత్నించిన జకియా వార్దక్ గత నెలలో ముంబై విమానాశ్రయంలో పట్టుబడిన సంగతి తెలిసిందే.
Zakia Wardak-Resigned
రెండేళ్లకు పైగా ఆఫ్ఘన్ కాన్సుల్ జనరల్ గా పనిచేసిన వార్దక్
ఆమె రెండేళ్లకు పైగా ముంబైలో ఆఫ్ఘన్ కాన్సుల్ జనరల్‌గా పనిచేశారు.
తర్వాత గతేడాది చివరి నుంచి న్యూఢిల్లీలో ఆఫ్ఘనిస్తాన్ తాత్కాలిక రాయబారిగా ఉన్నారు.
బంగారం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడటంతో వార్దక్ తో పాటు ఆమె కుటుంబంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆమె తన పదవికి రాజీనామా చేశారు.
వార్దక్ కు ఉన్న దౌత్యపరమైన సంబంధాల వల్ల ఆమెను అరెస్టు చేయలేదు.