Ram Charan: 'పెద్ది' నుంచి రెండో పాట విడుదల.. 'రై రై రా రా'మాస్ బీట్ అదుర్స్!
ఈ వార్తాకథనం ఏంటి
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, దర్శకుడు బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రం 'పెద్ది' నుంచి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న రెండో పాట 'రై రై రా రా' సాంగ్ విడుదలైంది. ఇప్పటికే విడుదలైన తొలి గీతం 'చికిరి' మంచి ఆదరణ పొందిన విషయం తెలిసిందే. ఈ పాటకు సంగీతం ఆస్కార్ విజేత ఆఏర్ రెహమాన్ అందించగా, సాహిత్యాన్ని అనంత శ్రీరామ్ రచించారు. ఈ గీతాన్ని రెహమాన్ స్వయంగా ఆలపించారు. పక్కా మాస్ బీట్‌తో, హీరో ఎలివేషన్ థీమ్‌తో సాగే ఈ పాటలో ఇంటెన్స్ ఫోక్ పెర్కషన్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
Details
ఏప్రిల్ 30న రిలీజ్
గ్రామీణ నేపథ్యంలో విజయం గీతంలా రూపొందిన ఈ ట్రాక్‌లో 'రై రై రా రా' అనే హుక్ లైన్ వినగానే ఆకట్టుకునేలా ఉందని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. థియేటర్లలో ఈ పాటకు భారీ రెస్పాన్స్ రావడం ఖాయమని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఈ చిత్రంలో చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇంకా కొంత షూటింగ్ మిగిలి ఉన్నప్పటికీ, ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ స్పష్టం చేసింది.