Tamil Nadu: నటి దేవిప్రియ కారుకు ఘోర ప్రమాదం.. డ్రైవర్ అక్కడికక్కడే మృతి
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ బుల్లితెర నటి దేవిప్రియ సోమవారం తెల్లవారుజామున తన సహాయకుడితో కలిసి కారులో చైన్నై నుంచి తిరుచ్చి వైపు ప్రయాణం ప్రారంభించారు. మార్గమధ్యంలో పెరంబలూరు సమీపంలో కారు టైరు పంక్చర్ కావడంతో డ్రైవర్ ముత్తుగణేశ్ (38) వాహనాన్ని రోడ్డు పక్కన నిలిపి టైరు మారుస్తుండగా విషాదం చోటుచేసుకుంది. ఇదే సమయంలో తిరుచ్చి వైపు నుంచి వేగంగా వచ్చిన గుర్తు తెలియని వాహనం అదుపు తప్పి దేవిప్రియ ప్రయాణిస్తున్న కారును బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్ ముత్తుగణేశ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
Details
తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్న దేవిప్రియ
కారు పక్కనే నిలబడి ఉన్న దేవిప్రియ తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. అయితే ఆమె సహాయకుడు దివాకర్ తీవ్రంగా గాయపడటంతో స్థానికులు వెంటనే పెరంబలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ముత్తుగణేశ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.