ముంబై: వార్తలు

కుంభకోణంతో సంబంధం ఉన్న విరాట్ కోహ్లీ వదిలిపెట్టిన ఆడి R8 సూపర్‌కార్‌

గతంలో భారత్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి చెందిన తెల్లటి రంగు ఆడి R8, మహారాష్ట్రలోని ఒక పోలీసు స్టేషన్ వెలుపల పాడుబడిన స్థితిలో గుర్తించారు. 2012లో ఈ R8 మోడల్ సూపర్‌కార్ ను కోహ్లి కొనుగోలు చేశారు.

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి పేరు వాడుకొని రూ.కోట్లు కాజేసిన మాజీ రంజీ ప్లేయర్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు వాడుకొని ఓ వక్తి దాదాపు 60కంపెనీల నుంచి రూ.3 కోట్ల వరకు కాజేశాడు. తాజాగా తనను తాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పరిచయం చేసుకుని రూ.12 లక్షల వరకు టోపీ పెట్టాడు. తర్వాత మోసపోయానని గమనించిన బాధితుడు పోలీసుల ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

ప్లాస్టిక్ సంచిలో కుళ్లిపోయిన మహిళ మృతదేహం; కుమార్తెపైనే అనుమానాలు

ముంబయిలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. లాల్‌బాగ్ ప్రాంతంలో 53 ఏళ్ల మహిళ మృతదేహం ప్లాస్టిక్ సంచిలో లభ్యమైంది. మృతదేహాన్ని నెలల తరబడి గదిలో ఉంచినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, మృతురాలు కుమార్తెపై అనుమానంతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు గురించి రైల్వే మంత్రిత్వ శాఖ తాజా సమాచారం

ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ అప్‌డేట్‌ను ట్విట్టర్‌లో మంత్రిత్వ శాఖ పంచుకుంది. ఫిబ్రవరి 28, 2023 నాటికి మొత్తం పురోగతి 26.33శాతం ఉందని పేర్కొంది. మహారాష్ట్ర మొత్తం పనిలో 13.72శాతం, గుజరాత్ సివిల్ వర్క్‌లో 52శాతానికి పైగా పూర్తి చేశాయి. ప్రస్తుతం 36.93శాతం పూర్తయింది.

ముంబయి: 100ఏళ్ల నాటి 'గేట్‌వే ఆఫ్ ఇండియా'కు పగుళ్లు- పెచ్చులూడుతున్న స్మారక చిహ్నం

మహారాష్ట్ర ముంబయికి సముద్రం ద్వారా వచ్చే సందర్శకులకు స్వాగతం పలికేందుకు 100ఏళ్ల క్రితం నిర్మించిన పురాతన కట్టడం 'గేట్‌వే ఆఫ్ ఇండియా'కు పగుళ్లు ఏర్పడినట్లు మహారాష్ట్ర ప్రభుత్వ ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్ పేర్కొంది.

E3W ఛార్జింగ్ స్టేషన్‌లను ఏర్పాటు చేసిన మహీంద్రా లాస్ట్ మైల్ మొబిలిటీ

మహీంద్రా లాస్ట్ మైల్ మొబిలిటీ, మహీంద్రా & మహీంద్రా గ్రూప్ లో ఒక విభాగం. ఇప్పుడు ఈ విభాగం ముంబై, దాని శివారు ప్రాంతాలలో ఆటోరిక్షా స్టాండ్‌లు, ఆటో డ్రైవర్ హోమ్ క్లస్టర్‌లు, జంక్షన్‌ల దగ్గర అనేక ఛార్జింగ్ స్టేషన్‌లను ఏర్పాటు చేసింది.

23 Feb 2023

కేరళ

చిన్నారి వైద్యం కోసం పేరు చెప్పకుండా రూ.11కోట్లు విరాళంగా ఇచ్చిన దాత

అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారి చికిత్స నిమిత్తం ఓ గుర్తు తెలియని వ్యక్తి ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా రూ.11కోట్లను విరాళంగా ఇచ్చాడు. అంత మొత్తం ఇచ్చిన వ్యక్తి అతని పేరు చెప్పకపోవడం గమనార్హం.

16 Feb 2023

బీబీసీ

బీబీసీ ఆఫీసుల్లో 45గంటలుగా కొనసాగుతున్న ఐటీ సోదాలు- మూడు రోజులుగా ఇంటికెళ్లని ఉద్యోగులు

దిల్లీ, ముంబయిలోని బీబీసీ కార్యాలయాల్లో మంగళవారం ఉదయం 11:30 గంటలకు ప్రారంభమైన ఆదాయపు పన్ను శాఖ సోదాలు గురువారం కూడా కొనసాగుతున్నాయి. దాదాపు 45 గంటలకు పైగా ఏకధాటిగా అధికారులు సర్వే చేస్తున్నారు.

15 Feb 2023

బీబీసీ

బీబీసీ కార్యాలయాల్లో రెండోరోజు కొనసాగుతున్న ఆదాయపు పన్నుశాఖ సోదాలు

ముంబయి, దిల్లీలో బీబీసీకి చెందిన కార్యాలయాల్లో ఆదాయపు పన్ను శాఖ సోదాలు బుధవారం కూడా కొనసాగాయి.

14 Feb 2023

బీబీసీ

BBC: బీబీసీ దిల్లీ, ముంబయి కార్యాలయాల్లో ఐటీ బృందాల సోదాలు

ఆదాయపు పన్ను శాఖ(ఐటీ) అధికారులు మంగళవారం దిల్లీ, ముంబయిలోని బీబీసీ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు.

13 Feb 2023

గూగుల్

గూగుల్ ఆఫీస్‌కు బాంబు బెదిరింపు- హైదరాబాద్‌లో వ్యక్తి అరెస్ట్

మహారాష్ట్ర పుణె నగరంలోని గూగుల్ కార్యాలయానికి సోమవారం బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. అయితే దీనిపై వెంటనే అప్రమత్తమైన పోలీసులు విచారించగా అది ఫేక్ కాల్ అని తేలింది.

తయారీ లోపాలతో అమెరికాలో 34వేల జనరిక్ ఔషధాల బాటిళ్లను వెనక్కి రప్పించిన సన్ ఫార్మా

US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఎన్‌ఫోర్స్‌మెంట్ రిపోర్ట్ ప్రకారం, సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ US-ఆధారిత విభాగం ఆంజినా, అధిక రక్తపోటు కొన్ని రకాల గుండె చికిత్సలకు ఉపయోగించే Diltiazem హైడ్రోక్లోరైడ్ క్యాప్సూల్స్‌ను వెనక్కి రప్పిస్తుంది.

ఐదు రాష్ట్రాలను కలిపే దిల్లీ-ముంబయి ఎక్స్‌ప్రెస్‌వే; రేపు ప్రారంభించనున్న ప్రధాని మోదీ

దేశ రాజధాని దిల్లీ, ఆర్థిక రాజధాని ముంబయిని కలుపుతూ, ఐదు రాష్ట్రాల గుండా వెళ్లే ప్రతిష్ఠాత్మక గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేను కేంద్రం చేపడుతోంది. 1,386 కిలోమీటర్లు దూరంతో దాదాపు రూ.4లక్షల వ్యయంతో నిర్మిస్తున్న దిల్లీ-ముంబయి ఎక్స్‌ప్రెస్‌వే మొదటి ఫేజ్‌ను ఆదివారం ప్రధానమంత్రి మోదీ ప్రారంభించనున్నారు.

10 Feb 2023

భూమి

ముంబై బుల్లెట్ రైలుకు మొట్టమొదటి అండర్ సీ టన్నెల్ 3-అంతస్తుల స్టేషన్‌

బుల్లెట్ రైలు పని మహారాష్ట్రలో వేగాన్ని పుంజుకుంది, దీనిని బాంబే హైకోర్టు "జాతీయ ప్రాముఖ్యత మరియు ప్రజా ప్రయోజనానికి సంబంధించిన" ప్రాజెక్ట్ అని పేర్కొంది.

జర్నలిస్టు రాణా అయ్యూబ్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు, పిటిషన్ కొట్టేవేత

జర్నలిస్టు రాణా అయ్యూబ్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. మనీలాండరింగ్ కేసులో ఘజియాబాద్ ప్రత్యేక కోర్టు జారీ చేసిన సమన్లను సవాలు చేస్తూ ఆమె వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు మంగళవారం కొట్టివేసింది.

'రోడ్డుపై ప్రయాణిస్తే విమానాల కంటే వేగంగా వెళ్లొచ్చు', నితిన్ గడ్కరీ కామెంట్స్

ఎవరైనా దూరప్రయాణాలకు వెళ్లేటప్పడు గమ్య స్థానాలకు త్వరగా చేరుకోవాలంటే విమానాలను ఎంచుకొంటారు. అయితే ఇప్పుడు విమానాల కంటే వేగంగా రోడ్డు మార్గం ద్వారానే వెళ్లొచ్చని చెబుతున్నారు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ. సోమవారం ఆజ్‌తక్ నిర్వహించిన కాన్‌క్లేవ్ లో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

03 Feb 2023

ఎన్ఐఏ

'ముంబయిలో తాలిబన్ ఉగ్రదాడులు', ఎన్‌ఐఏకు బెదిరింపు మెయిల్

ముంబయిలోని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) కార్యాలయానికి బెదిరింపు మెయిల్ వచ్చింది. ముంబయిలో ఒక వ్యక్తి ఉగ్రదాడికి పాల్పడతాడని అందులోని సారాంశం.

31 Jan 2023

విమానం

విస్తారా విమానంలో ఇటాలియన్ ప్రయాణికురాలి బీభత్సం, మద్యం మత్తులో అర్ధనగ్న ప్రదర్శన

విమానాల్లో ప్రయాణికుల అనుచిత ప్రవర్తనలు ఇటీవల తరుచూ వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా అబుదాబి నుంచి ముంబయికు వస్తున్న విస్తారా ఎయిర్‌లైన్ ఫ్లైట్ (యూకే 256)లో మరో సంఘటన జరిగింది. ఇటాలియన్ ప్రయాణీకురాలు విమానంలో మద్యం మత్తులో బీభత్సం చేయడంతో అమెను పోలీసులకు అప్పగించారు.