LOADING...
Mumbai: ముంబైలో పావురాలకు ఆహారం పెట్టడంపై వివాదం.. దాదర్‌ కబుతర్‌ఖానా వద్ద పోలీసులు భారీ బందోబస్తు, జైన్‌ ఆలయం మూసివేత
ముంబైలో పావురాలకు ఆహారం పెట్టడంపై వివాదం.. పోలీసులు భారీ బందోబస్తు

Mumbai: ముంబైలో పావురాలకు ఆహారం పెట్టడంపై వివాదం.. దాదర్‌ కబుతర్‌ఖానా వద్ద పోలీసులు భారీ బందోబస్తు, జైన్‌ ఆలయం మూసివేత

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 13, 2025
03:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

ముంబై దాదర్‌లోని ప్రముఖ కబుతర్‌ఖానా (పావురాల ఆహారం పెట్టే ప్రదేశం)వద్ద బుధవారం ఉదయం నుంచే పోలీసులు భారీగా మోహరించారు. సమీపంలోని జైన్‌ ఆలయం తలుపులు కూడా మూసివేసింది. మరాఠీ ఏకీకరణ సమితి నిర్వహించనున్న నిరసనకు ముందు ఈ చర్యలు చేపట్టారు. కోర్టు విధించిన పావురాలకు ఆహారం పెట్టడంపై నిషేధాన్ని కఠినంగా అమలు చేయాలని,గత వారం జైన్‌ భక్తులు టార్పాలిన్‌ కవర్‌ను తొలగించి పావురాలకు ఆహారం పెట్టడం ద్వారా ఆ ఆదేశాలను ఉల్లంఘించారని ఆరోపిస్తూ చర్యలు తీసుకోవాలని ఆ సమితి డిమాండ్‌ చేస్తోంది. ఈ నిరసనకు మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS)మద్దతు ఇచ్చింది.

వివరాలు 

పోలీసులు నిరసన చేయవద్దని నోటీసులు

మరాఠీ ఏకీకరణ సమితి సభ్యుడు ప్ర‌మోద్‌ పార్టే తెలిపిన ప్రకారం,ఎంఎన్ఎస్‌,శివసేన (యుబిటి)తో పాటు పలు రాజకీయ పార్టీల నాయకులు కూడా ఈ నిరసనలో పాల్గొననున్నారు. అయితే ఉదయం 10 గంటలకు జరగాల్సిన ఆందోళన ఆ సమయానికి మొదలుకాలేదు. స్థానిక సామాజిక కార్యకర్త చేతన్‌ కాంబ్లే మాట్లాడుతూ.. "జనం గుమ్మికూడినా కానీ నిర్వాహకులు ఆలస్యం చేశారు. ఆలస్యానికి గల కారణం, స్పష్టంగా తెలియదు. పోలీసులు నిరసన చేయవద్దని నోటీసులు పంపించారని చెబుతున్నారు. మధ్యాహ్నం వరకు దుకాణాలు మూసేయాలని కూడా చెప్పారట. అయితే ప్రస్తుతం చాలావరకు దుకాణాలు తెరిచే ఉన్నాయి" అని చెప్పారు.

వివరాలు 

ఆ నిర్ణయం బీఎంసీదే: బాంబే కోర్టు 

ఈ నిరసన జరుగుతున్న సమయంలోనే బాంబే హైకోర్టులో కూడా కబుతర్‌ఖానా వివాదంపై విచారణ జరుగుతోంది. పావురాల విసర్జన వల్ల కలిగే ఆరోగ్యప్రమాదాలను అంచనా వేసే నిపుణుల కమిటీ ఏర్పాటు గురించి వివరాలు సమర్పించాల్సిందిగా మున్సిపల్‌ సంస్థ (బీఎంసీ)ను కోర్టు కోరింది. పావురాల ఆహారం పెట్టే ప్రదేశాలను మూసివేయమని తాము ఎక్కడా ఆదేశించలేదని, ఆ నిర్ణయం బీఎంసీదేనని కోర్టు ఇప్పటికే స్పష్టంచేసింది. ఇదే సమయంలో, ఈ అంశాన్ని కోర్టులోకి తీసుకువెళ్లిన పిటిషనర్లు పల్లవి పాటిల్‌, షెనా విసారియా మంగళవారం బీఎంసీకి లేఖ రాసి, కబుతర్‌ఖానాలను తిరిగి తెరవాలని కోరినట్లు సమాచారం. ఈ చట్టపరమైన, పరిపాలనా వివాదం దాదర్‌ పరిసరాల్లో ఉద్రిక్తతలకు దారి తీశాయి. పోలీసులు అప్రమత్తం ఉన్నారు.