LOADING...
T20 World Cup 2026: మళ్లీ ఓడిపోయిన ఆస్ట్రేలియా.. శ్రీలంక అద్భుత విజయం
మళ్లీ ఓడిపోయిన ఆస్ట్రేలియా.. శ్రీలంక అద్భుత విజయం

T20 World Cup 2026: మళ్లీ ఓడిపోయిన ఆస్ట్రేలియా.. శ్రీలంక అద్భుత విజయం

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 17, 2026
09:08 am

ఈ వార్తాకథనం ఏంటి

టీ20 ప్రపంచకప్‌లో శ్రీలంక, ఆస్ట్రేలియా మధ్య ఆసక్తికర పోరు సాగింది. ఈ మ్యాచులో శ్రీలంక ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపొందింది. శ్రీలంక బ్యాటింగ్‌లో పాతుమ్ నిశాంక ప్రధాన హీరోగా నిలిచాడు. 52 బంతుల్లో శతకాన్ని పూర్తి చేసి అదరగొట్టాడు. ఈ ప్రదర్శనలో పది ఫోర్లు, ఐదు సిక్సులు ఉన్నాయి. కుషాల్ మెండీస్ కూడా 51 పరుగులతో హాఫ్ సెంచరీ సాధించి టీమును బలపరిచాడు. 28 పరుగులు చేసిన ఇతర ఆటగాళ్ల ప్రదర్శన కూడా సమర్ధవంతంగా ఉండి, జట్టుకు స్థిరమైన స్కోరు కట్టింది. ఆస్ట్రేలియా బౌలింగ్‌లో స్టోయినీస్ మాత్రమే రెండు వికెట్లు తీశాడు. మిగతా బౌలర్లు విఫలమయ్యారు. ఈ ఓటమితో ఆస్ట్రేలియాకు సూపర్-8 దశలోకి వెళ్లడం కష్టమవుతోంది.

Details

చివరి ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయిన ఆసీస్

మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 181 పరుగులకే ఆలౌటైంది. మిచెల్ మార్ష్ 54 పరుగులు చేసి హాఫ్ సెంచరీ సాధించాడు, అలాగే ట్రావిస్ హెడ్ 56 పరుగులతో జట్టును నిలిపాడు. కానీ కామెరూన్ గ్రీన్ 3, టిమ్ డేవిడ్ 6, మార్కస్ స్టోయినిస్ 4, కూపర్ 3 పరుగులకే అవుట్ అయ్యారు. జోష్ ఇంగ్లిస్ 27, గ్లెన్ మాక్స్‌వెల్ 22 పరుగులు చేసి కొంత సంతృప్తికరమైన ప్రదర్శన ఇచ్చారు. శ్రీలంక బౌలింగ్‌లో దుషాన్ హేమంత్ 3 వికెట్లు తీశాడు. చమీర, తీక్షణ, దునిత్, కుషాల్ మెండిస్ ఒక్కో వికెట్ కాస్త బలాన్ని చేకూర్చారు. చివరి ఓవర్‌లో ఆస్ట్రేలియా మూడు వికెట్లు కోల్పోయింది, అందులో రెండు రనౌట్లు కూడా ఉన్నాయి.

Advertisement