శ్రీలంక: వార్తలు
23 Mar 2023
క్రికెట్న్యూజిలాండ్పై ప్రతీకారం తీర్చుకోవడానికి శ్రీలంక సిద్ధం
ఇటీవల న్యూజిలాండ్ 2-0 తేడాతో శ్రీలంకపై టెస్టు సిరీస్‌ను గెలుచుకుంది. తాజాగా మార్చి 25 నుంచి మూడు వన్డేల సిరీస్‌లో న్యూజిలాండ్‌తో తలపడేందుకు శ్రీలంక సిద్ధమైంది. టెస్టు సిరీస్‌లో జరిగిన పరాభావానికి ప్రతీకారం తీర్చుకోవాలని శ్రీలంక భావిస్తోంది. టెస్టుల్లో గెలిచి జోష్ మీద ఉన్న న్యూజిలాండ్ అదే ఊపుతో వన్డే సిరీస్ పై కన్నేసింది.
20 Mar 2023
క్రికెట్టీమ్ ఓటమి కారణంగా కెప్టెన్సీకి రాజీనామా
న్యూజిలాండ్ చేతిలో 2-0తేడాతో సిరీస్ కోల్పోయిన తరుణంలో శ్రీలంక కెప్టెన్ దిముత్ కరుణరత్నే సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఐర్లాండ్‌తో రెండు టెస్టుల సిరీస్ (ఏప్రిల్ 16 నుంచి 18) తర్వాత కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ఇవాళ ప్రకటించారు . ఇదే విషయాన్ని శ్రీలంక క్రికెట్ బోర్డుకు కరుణ్ రత్నే తెలియజేశాడు.
20 Mar 2023
క్రికెట్టెస్టుల్లో ధనంజయ డి సిల్వా అద్భుత ఘనత
న్యూజిలాండ్‌తో జరిగిన చివరి టెస్టులో శ్రీలంక ఆటగాడు ధనంజయ డి సిల్వా అద్భుత ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో 185 బంతుల్లో 98 పరుగులు చేసి అరుదైన ఫీట్‌ను సాధించాడు.
20 Mar 2023
క్రికెట్శ్రీలంక లెజెండ్ అర్జున రణతుంగ రికార్డును అధిగమించిన దినేష్ చండిమాల్
న్యూజిలాండ్‌తో జరుగుతున్న చివరి టెస్టులో వెటరన్ శ్రీలంక బ్యాటర్ దినేష్ చండిమాల్ అర్ధ శతకంతో చెలరేగాడు. కేవలం 92 బంతుల్లో 62 పరుగులు చేశాడు.
10 Mar 2023
క్రికెట్NZ vs SL: తొలి టెస్టులో పట్టు బిగించిన శ్రీలంక
న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో శ్రీలంక పట్టు బిగించింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 355 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ కరుణరత్నే 50 పరుగులు చేయగా కుశాల్ మెండిస్ 87 పరుగులతో రాణించారు.
13 Feb 2023
తమిళనాడు'ఎల్టీటీఈ నాయకుడు ప్రభాకరన్ బతికే ఉన్నారు'; నెడుమారన్ సంచలన కామెంట్స్
తమిళ్ నేషనలిస్ట్ మూవ్మెంట్ నాయకుడు పజా నెడుమారన్ సోమవారం సంచలన కామెంట్స్ చేశారు. లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం (ఎల్టీటీఈ) నాయకుడు వేలుపిళ్లై ప్రభాకరన్ ఆరోగ్యంగా, క్షేమంగా, సజీవంగా ఉన్నారని ప్రకటించారు. త్వరలోనే తమిళ జాతి విముక్తి కోసం ఒక ప్రణాళికను ప్రకటిస్తారని పేర్కొన్నారు.
11 Feb 2023
క్రికెట్సౌతాఫ్రికాపై శ్రీలంక సంచలన విజయం
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ లో సౌతాఫ్రికాపై శ్రీలంక సంచలన విజయం నమోదు చేసింది. శుక్రవారం జరిగిన మొదటి మ్యాచ్‌లో శ్రీలంక జట్టు 3 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 129 పరుగులను చేసింది.
12 Jan 2023
క్రికెట్శ్రీలంక బ్యాటర్లకు చుక్కలు చూపించిన భారత బౌలర్లు
ఈడెన్ గార్డెన్స్‌లో శ్రీలంకతో భారత్ రెండో వన్డే జరిగింది. ఈ మ్యాచ్ భారత్ బౌలర్లు విజృంభించడంతో శ్రీలంక 215 పరుగలకు అలౌట్ అయింది. శ్రీలంక బ్యాటర్లు ఫెర్నాండ్ (50), మెండిస్ (32) మాత్రమే రాణించారు. మిగతా బ్యాట్ మెన్స్ విఫలం కావడంతో శ్రీలంక తక్కువ స్కోర్ కే పరిమితమైంది.
12 Jan 2023
క్రికెట్వన్డేలోకి అరంగ్రేటం చేసిన శ్రీలంక ఆటగాడు ఫెర్నాండో
భారత్‌తో జరుగుతున్న రెండో వన్డేలో శ్రీలంక బ్యాటర్ సువానీడు ఫెర్నాండో తన తొలి అంతర్జాతీయ క్యాప్‌ను అందుకున్నారు. కుడిచేతి వాటం కలిగిన ఈ ఓపెనర్ తన కెరీర్‌ను అద్భుతంగా ప్రారంభించాడు. ఓపెనర్ పాతుమ్ నిస్సాంక వెన్నుముక గాయం కారణంగా రెండో వన్డేకు దూరమయ్యాడు. ఆయన స్థానంలో ఫెర్నాండో రెండో వన్డేలో ఎంపికయ్యాడు.
11 Jan 2023
భారత జట్టుశ్రీలంక రెండో వన్డేలో పుంజుకునేనా..?
శ్రీలంకతో జరిగిన మొదటి వన్డేలో భారత్ 67 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. ఎలాగైనా రెండో వన్డేలో నెగ్గి సిరీస్ కైవసం చేసుకోవాలని టీమిండియా భావిస్తోంది. ఇక తొలి వన్డేలో ఫర్వాలేదనిపించిన శ్రీలంక రెండో వన్డేలో నెగ్గి సిరీస్ ను సమం చేయాలని చూస్తోంది.
11 Jan 2023
క్రికెట్దసున్ శనక సెంచరీ వృథా
శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. 374 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 306 పరుగులు మాత్రమే చేసింది.
10 Jan 2023
క్రికెట్వన్డేల్లో శ్రీలంక పేసర్ అరంగ్రేటం
శ్రీలంక పేసర్ దిల్షాన్ మధుశంక భారత్ తో జరిగిన వన్డేలో శ్రీలంక తరుపున అరంగ్రేటం చేశారు. ఈ లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్ తన T20I కెరీర్లో మంచి ప్రారంభాన్ని ప్రారంభించాడు.
05 Jan 2023
క్రికెట్టీ20 సిరీస్‌పై టీమిండియా గురి
శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో భారత్ అతి కష్టం మీద మ్యాచ్ ను గెలిచింది. నేడు సాయంత్రం పుణేలో రెండో టీ20 జరగనుంది. ఈ మ్యాచ్ ఎలాగైనా నెగ్గి సిరీస్ సాధించాలని భావిస్తోంది టీమిండియా.
04 Jan 2023
క్రికెట్హడలెత్తించిన మావి.. భారత్ థ్రిలింగ్ విన్
కొత్త ఏడాదిని భారత్ విజయంతో ప్రారంభించింది. శ్రీలంకతో జరిగిన టీ20లో బ్యాటర్లు విఫలమైనా.. బౌలర్లు రాణించారు. డెబ్యూ బౌలర్ శివమ్‌మావి లంక బ్యాటర్లకు చుక్కులు చూపించాడు. నాలుగు ఓవర్లలో 22 పరుగులిచ్చి.. నాలుగు వికెట్లు తీశాడు. ఉమ్రాన్ మాలిక్, హర్షల్ పటేల్ రాణించడంతో టీమిండియా విజయం సాధించింది. అఖరి బంతి వరకు మ్యాచ్ ఉత్కంఠను రేపింది.
03 Jan 2023
భారత జట్టుటీమిండియా ప్రతీకారం తీర్చుకుంటుందా..?
ఆసియా కప్ సమయంలో లంకేయుల చేతిలో భారత జట్టు ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఈ ఏడాదిలో బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్ ఓడిపోయింది. ఈ నేపథ్యంలో భారత్ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. నేటి నుండి జరిగే శ్రీలంక సిరీస్ టీమిండియా ఆటగాళ్లు అత్యుత్తమ ప్రదర్శనతో అలరిస్తారో లేదో వేచి చూడాలి.
29 Dec 2022
భారత జట్టుభారత్ టీంను ఢీకొట్టే శ్రీలంక జట్టు ఇదే..
జనవరిలో భారత్‌లో పర్యటించే శ్రీలంక జట్టును శ్రీలంక క్రికెట్‌బోర్డు ప్రకటించింది. టీమిండియా శ్రీలంకతో మూడు టీ20 మ్యాచ్‌లు, మూడు వన్డే సిరీస్ లను ఆడనుంది. జనవరి 3 నుంచి మ్యాచ్ లు ప్రారంభం కానున్నాయి. శ్రీలంక జట్టు పగ్గాలను దసున్ షనకకు అప్పగించారు.